Telugu Global
Cinema & Entertainment

సంపూర్ణేష్ బాబుతో.... క్రిష్ ?

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా మరిన సంపూర్ణేష్ బాబు మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. తాజాగా ‘కొబ్బ‌రిమ‌ట్ట’ సినిమాతో మరొక మంచి విజయాన్ని సాధించాడు సంపూ. ఈ సినిమాతో నిర్మాతలు కూడా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. దీనితో అందరి దృష్టి ఇప్పుడు సంపూ పై పడింది. స్పూఫ్ కామెడీ సినిమాలే చేసినప్పటికీ రెండూ హిట్లు అయ్యాయి. ఈ సినిమాతో పాటు విడుద‌లైన ‘మ‌న్మ‌థుడు 2’ డిజాస్ట‌ర్ గా మారింది… కానీ ‘కొబ్బ‌రి మ‌ట్ట’ మాత్రం […]

సంపూర్ణేష్ బాబుతో.... క్రిష్ ?
X

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా మరిన సంపూర్ణేష్ బాబు మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. తాజాగా ‘కొబ్బ‌రిమ‌ట్ట’ సినిమాతో మరొక మంచి విజయాన్ని సాధించాడు సంపూ.

ఈ సినిమాతో నిర్మాతలు కూడా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. దీనితో అందరి దృష్టి ఇప్పుడు సంపూ పై పడింది. స్పూఫ్ కామెడీ సినిమాలే చేసినప్పటికీ రెండూ హిట్లు అయ్యాయి. ఈ సినిమాతో పాటు విడుద‌లైన ‘మ‌న్మ‌థుడు 2’ డిజాస్ట‌ర్ గా మారింది… కానీ ‘కొబ్బ‌రి మ‌ట్ట’ మాత్రం లాభాల్ని సంపాదించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇక సంపూతో సినిమా అంటే లాభాల బాటే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. సంపూ తో కామెడీ అంటే అది బాగానే వ‌ర్క‌వుట్ అవుతుంది అని అభిమానులు కూడా నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు కొందరు పెద్ద నిర్మాత‌లు కూడా సంపూతో ఓ కామెడీ సినిమా చేయాలని అనుకుంటున్నారట.

ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు క్రిష్ సంపూతో ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాకి క్రిష్ నిర్మాత‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడని టాక్. మ‌రోవైపు సి.క‌ల్యాణ్ కూడా సంపూతో సినిమా చేయాల‌ని ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం.

First Published:  2 Sep 2019 7:02 PM GMT
Next Story