Telugu Global
Cinema & Entertainment

దర్శకుడి గా మారుతున్న పీటర్ హెయిన్స్

ఎన్నో ప్రతిష్టాత్మక సినిమా ల కి ఫైట్ మాస్టర్ గా పని చేసిన పీటర్ హెయిన్స్ ఇప్పుడు దర్శకుడి గా మారబోతున్నాడు. అయితే ఆసక్తికరం గా తన మొదటి సినిమా కి ఒక తెలుగు నిర్మాత దొరికాడు. నిర్మాత న‌ల్ల‌మ‌లుపు బుజ్జి తన సొంత నిర్మాణ సంస్థ అయిన ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో పీట‌ర్ హెయిన్స్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు ఇప్పటికే ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కి సంబంధించిన అధికారిక ప్రకటన […]

దర్శకుడి గా మారుతున్న పీటర్ హెయిన్స్
X

ఎన్నో ప్రతిష్టాత్మక సినిమా ల కి ఫైట్ మాస్టర్ గా పని చేసిన పీటర్ హెయిన్స్ ఇప్పుడు దర్శకుడి గా మారబోతున్నాడు. అయితే ఆసక్తికరం గా తన మొదటి సినిమా కి ఒక తెలుగు నిర్మాత దొరికాడు. నిర్మాత న‌ల్ల‌మ‌లుపు బుజ్జి తన సొంత నిర్మాణ సంస్థ అయిన ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో పీట‌ర్ హెయిన్స్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు ఇప్పటికే ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ఈ సినిమా కి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు వెలువడింది. ఈ చిత్రాన్ని బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తున్నారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉండనుందని చెబుతున్నారు.

పీట‌ర్ హెయిన్స్ చెప్పిన క‌థ విన‌గానే ఎంతగానో నచ్చడం తో బుజ్జి వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. ఆయన చెప్పిన దాని ప్రకారం క‌థ టేకాఫ్ అయ్యే విధానం నుంచి ప్ర‌తిదీ ఎక్స్ ట్రార్డిన‌రీగా ఉండనుందట.

హీరో, హీరోయిన్ తో పాటు ఇత‌ర ఆర్టిస్టుల‌ను ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

First Published:  3 Sep 2019 5:37 AM GMT
Next Story