Telugu Global
NEWS

కరీబియన్ టూర్ లో భారత్ క్లీన్ స్వీప్

జమైకాటెస్టులో భారత్ 257 పరుగుల విజయం టెస్ట్ లీగ్ టేబుల్ టాపర్ గా భారత్ ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న తొమ్మిది దేశాల టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ టేబుల్ టాపర్ గా…టాప్ ర్యాంకర్ భారత్ నిలిచింది. జమైకాలోని కింగ్స్ టన్ వేదికగా ముగిసిన రెండోటెస్ట్ ను 257 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా భారత్ 2-0తో సిరీస్ స్వీప్ సాధించింది. నెలరోజుల విండీస్ టూర్ ను అత్యంత విజయవంతంగా ముగించగలిగింది. 160 పాయింట్లతో భారత్ టాప్… టెస్ట్ క్రికెట్ 8వ ర్యాంకర్ […]

కరీబియన్ టూర్ లో భారత్ క్లీన్ స్వీప్
X
  • జమైకాటెస్టులో భారత్ 257 పరుగుల విజయం
  • టెస్ట్ లీగ్ టేబుల్ టాపర్ గా భారత్

ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న తొమ్మిది దేశాల టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ టేబుల్ టాపర్ గా…టాప్ ర్యాంకర్ భారత్ నిలిచింది.

జమైకాలోని కింగ్స్ టన్ వేదికగా ముగిసిన రెండోటెస్ట్ ను 257 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా భారత్ 2-0తో సిరీస్ స్వీప్ సాధించింది. నెలరోజుల విండీస్ టూర్ ను అత్యంత విజయవంతంగా ముగించగలిగింది.

160 పాయింట్లతో భారత్ టాప్…

టెస్ట్ క్రికెట్ 8వ ర్యాంకర్ విండీస్ తో జరిగిన రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను భారత్ 2-0తో కైవసం చేసుకొంది. రెండుకు రెండు టెస్టులను మొదటి నాలుగురోజుల ఆటలోనే సొంతం చేసుకోడం ద్వారా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.

ఆంటీగాలో ముగిసిన తొలిటెస్టు ను 317 పరుగులతో నెగ్గిన భారత్…జమైకా టెస్ట్ లో 257 పరుగులతో విజేతగా నిలిచింది.

జడేజా స్పిన్ మ్యాజిక్..

మూడోరోజు ఆటలో సాధించిన స్కోరుతో నాలుగోరోజు ఆటను కొనసాగించిన కరీబియన్ టీమ్ 58,5 ఓవర్లలో 210 పరుగులకే కుప్పకూలింది.

ఓపెనర్ బ్రూక్స్ 50 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్లాక్ వుడ్ 38, కెప్టెన్ హోల్డర్ 39 పరుగుల స్కోర్లు సాధించగా… భారత బౌలర్లలో షమీ, జడేజా చెరో మూడు వికెట్లు, బుమ్రా 1 వికెట్, ఇశాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు.

భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన తెలుగు తేజం హనుమ విహారీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని రెండుకు రెండుటెస్టులు నెగ్గిన భారత్ మొత్తం 120 పాయింట్లతో తొమ్మిదిదేశాల లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

ప్రస్తుత సిరీస్ విజయంతో.. టెస్ట్ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ గా విరాట్ కొహ్లీ రికార్డుల్లో చేరాడు.

విండీస్ తో టీ-20 సిరీస్ ను 3-0తోను, వన్డే సిరీస్ ను 2-0తోనూ నెగ్గిన భారత్ చివరకు టెస్ట్ సిరీస్ లో సైతం 2-0తో నెగ్గడం ద్వారా కరీబియన్ ద్వీపాల పర్యటనను అత్యంత విజయవంతంగా ముగించగలిగింది.

First Published:  2 Sep 2019 10:16 PM GMT
Next Story