Telugu Global
Cinema & Entertainment

రష్మికను.... కే.జి.యఫ్ స్టార్ టార్గెట్ చేశాడా?

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికి రష్మిక మందన్న తన స్టేట్మెంట్ ల వలన చాలాసార్లు కన్నడ ప్రేక్షకుల నుంచి ట్రోల్స్ కి గురైంది. అయితే తాజాగా కే జి ఎస్ స్టార్ ‘కిస్’ అనే సినిమా గురించి మాట్లాడిన మాటలు డైరెక్టుగా ‘డియర్ కామ్రేడ్’ నటి ని టార్గెట్ చేసినట్లు గా కనిపించాయి. ఇతర ఇండస్ట్రీలో నుంచి కన్నడ ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న హీరోయిన్ లను చూస్తే తనకు చాలా గర్వంగా ఉందని, అలానే కన్నడ ఇండస్ట్రీ […]

రష్మికను.... కే.జి.యఫ్ స్టార్ టార్గెట్ చేశాడా?
X

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికి రష్మిక మందన్న తన స్టేట్మెంట్ ల వలన చాలాసార్లు కన్నడ ప్రేక్షకుల నుంచి ట్రోల్స్ కి గురైంది.

అయితే తాజాగా కే జి ఎస్ స్టార్ ‘కిస్’ అనే సినిమా గురించి మాట్లాడిన మాటలు డైరెక్టుగా ‘డియర్ కామ్రేడ్’ నటి ని టార్గెట్ చేసినట్లు గా కనిపించాయి.

ఇతర ఇండస్ట్రీలో నుంచి కన్నడ ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న హీరోయిన్ లను చూస్తే తనకు చాలా గర్వంగా ఉందని, అలానే కన్నడ ఇండస్ట్రీ నుంచి వేరే భాష లో పనిచేసే వాళ్ళు తమ మాతృభాష, సొంత గడ్డ ని మర్చిపోకూడదు అంటూ కామెంట్ చేశాడు యష్.

శ్రీ లీల అనే హీరోయిన్ ని పొగుడుతూ యష్ చేసిన కామెంట్లు రష్మిక మందన్న ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నాయి.

మరోవైపు రష్మిక మందన్న…. తెలుగు మరియు తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఏదేమైనా యష్ మాత్రం వివాదంపై నోరు విప్పడానికి ఆసక్తి చూపించడం లేదు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోర్ట్ ఆర్డర్ వల్ల ఆగిపోయింది. ఈ సినిమా విడుదల తేదీ గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. యష్… రష్మీక ని దృష్టిలో పెట్టుకునే ఇలాంటి కామెంట్స్ చేసారని చెబుతున్నారు.

First Published:  3 Sep 2019 12:24 AM GMT
Next Story