ఆర్ఆర్ఆర్…. ఏమాత్రం ఫీల్ అవ్వడం లేదట !

‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్ రికార్డులను తిరగ రాసిన జక్కన్న ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ అనే మరొక భారీ బడ్జెట్ సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆలియాభట్ పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదట.

అలియా పాత్ర ఒకరకంగా ఎక్స్ టెండెడ్ గెస్ట్ రోల్ తరహాలో ఉంటుందని… తక్కువ సన్నివేశాలు, ఒకటి రెండు పాటలకి మాత్రమే ఆమె పాత్ర పరిమితమని సమాచారం.

చిత్ర బృందం కూడా ఈ వార్తల్లో నిజం ఉన్నట్లు చెబుతోంది. కానీ అలియా మాత్రం ఈ విషయంలో ఏమాత్రం ఫీల్ అవ్వడం లేదట. తన అభిమాన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో పని చేయడమే గొప్పగా భావిస్తున్నానని, అంతేగాని పాత్ర గురించి అసలు ఆలోచించడం లేదని చెబుతోంది.

తాజాగా హైదరాబాద్ లో జరగబోయే ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్ లో అలియా కూడా జాయిన్ అవ్వనుంది. డి.వి.వి.దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.