లోకేష్ టూర్ వేళ అయ్య‌న్న‌కు ఝ‌ల‌క్ !

విశాఖ జిల్లాలో టీడీపీకి మ‌రో షాక్ త‌గిలింది, మొన్న‌నే అన‌కాప‌ల్లి నుంచి టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ఆడారి ఆనంద్‌కుమార్ వైసీపీలో చేరారు. ఇప్పుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు టీడీపీకి ఝలక్ ఇచ్చారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నర్సీపట్నం పర్యటనలో ఉండగానే పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించి సన్యాసిపాత్రుడు సంచ‌ల‌నం సృష్టించారు.

నర్సీపట్నంలో మాజీ మ౦త్రి అయన్నపాత్రుడు పుట్టినరోజు వేడుకలో నారా లోకేష్ పాల్గొన్నారు. సోదరులైన అయ్యన్నపాత్రుడు, సన్యాసిపాత్రుడుల పుట్టినరోజు ఒక్కటే. దీంతో త‌న బ‌ర్త్ డే రోజు సోద‌రుడికి ఝ‌ల‌క్ ఇవ్వ‌డం నియోక‌వ‌ర్గంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్రస్తుత౦ నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడిగా సన్యాసిపాత్రుడు కొనసాగుతున్నారు. కొ౦తకాల౦గా సోదరులు అయ్యన్న పాత్రుడు,సన్యాసి పాత్రుడు మధ్య విభేదాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న‌ పుట్టిన రోజు నాడు ఈ నిర్ణయం తీసుకోవడం బాధగా ఉందని స‌న్యాసి పాత్రుడు అన్నారు.

ఇనాళ్ళు టిడిపి పార్టీ కి విధేయుడుగా పని చేసిన‌ట్లు చెప్పారు. పార్టీ క్యాడర్ ను ప‌క్క‌న‌ పెట్టి వ్యక్తిగతంగా నర్సీపట్నం లో వ్యవహరాలు జరిగాయ‌ని ఆయ‌న చెప్పారు. పార్టీ లో త‌న‌కు సరైన గుర్తింపు లేదని అన్నారు. పార్టీ పెద్దలు అధినాయుకులకు ఎన్ని సార్లు ఈ విషయం చెప్పినా ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు. అందుకే తాను పార్టీ మారుతున్నానని చెప్పుకొచ్చారు. టిడిపి త‌మ‌ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టే పార్టీ విడుతున్నానని కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పారాయ‌న‌.