ఇది ఓంకార్ సెంటిమెంట్

సినిమా జనాల్లో ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. డిసెంబర్ లో తన సినిమా రిలీజ్ అయితే సూపర్ హిట్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ నాగార్జునది. ప్రతి పండక్కి తన సినిమా ఉండాల్సిందే అనేది బాలయ్య సెంటిమెంట్. తన ప్రతి సినిమా రిలీజ్ కు దిల్ రాజు తిరుపతి వెళ్లాల్సిందే. ఇలా చెప్పుకుంటూ పోతే పరిశ్రమలో ప్రతి మనిషికి ఇలా ఏదో ఒక సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు ఓంకార్ సెంటిమెంట్ కూడా బయటపడింది.

ఓంకార్ కు అక్టోబర్ సెంటిమెంట్ ఉంది. తను ఏ సినిమా చేసినా అక్టోబర్ లోనే రిలీజ్ చేస్తాడు. రాజుగారి గది సినిమా అక్టోబర్ లోనే రిలీజైంది. అది సూపర్ హిట్ అయింది. రాజుగారి గది-2 సినిమా కూడా అక్టోబర్ లోనే రిలీజైంది. అది కూడా కమర్షియల్ గా హిట్ అయింది. ఇప్పుడు రాజుగారి గది-3 సినిమాను కూడా అక్టోబర్ లోనే విడుదల చేస్తున్నాడు ఓంకార్.

అవికా గౌర్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా సైమల్టేనియస్ గా పూర్తిచేస్తున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇలా దశలవారీగా అటు ప్రమోషన్, ఇటు ప్రొడక్షన్ చేపట్టి దసరా బరిలో రాజుగారి గది-3ను థియేటర్లలోకి తీసుకురావాలనేది ఓంకార్ ప్లాన్. ఇది అతడికి సెంటిమెంట్ మరి.