Telugu Global
NEWS

తిరిగి తెలంగాణలోనే రిపోర్ట్ చేసిన స్టీఫెన్ రవీంద్ర

సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఏపీకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఆయన తిరిగి తెలంగాణలోనే రిపోర్టు చేశారు. పాత పోస్టులోనే జాయిన్ అయ్యారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీఫెన్ రవీంద్రను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తీసుకోవాలని జగన్ భావించారు. అందు కోసం స్టీఫెన్ రవీంద్రను ఏపీకి వెళ్లేలా కేసీఆర్‌ కూడా అంగీకరించారు. ఇరు రాష్ట్రాల ఆమోదం తర్వాత ఫైల్‌ను కేంద్ర హోంశాఖకు పంపించారు. కానీ మూడు నెలలు అవుతున్నా కేంద్రం నుంచి ఎలాంటి […]

తిరిగి తెలంగాణలోనే రిపోర్ట్ చేసిన స్టీఫెన్ రవీంద్ర
X

సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఏపీకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఆయన తిరిగి తెలంగాణలోనే రిపోర్టు చేశారు. పాత పోస్టులోనే జాయిన్ అయ్యారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీఫెన్ రవీంద్రను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తీసుకోవాలని జగన్ భావించారు. అందు కోసం స్టీఫెన్ రవీంద్రను ఏపీకి వెళ్లేలా కేసీఆర్‌ కూడా అంగీకరించారు. ఇరు రాష్ట్రాల ఆమోదం తర్వాత ఫైల్‌ను కేంద్ర హోంశాఖకు పంపించారు. కానీ మూడు నెలలు అవుతున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఇప్పటికే మూడు నెలలుగా లీవ్‌ మీద రవీంద్ర ఉన్నారు. ఆగస్ట్ 31న తన సెలవు కాలం ముగిసింది. మరోసారి పొడిగించుకునే వీలున్నా స్టీఫెన్ రవీంద్ర మాత్రం అలా చేయలేదు. తిరిగి హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీగా బాధ్యతలు స్వీకరించారు. స్టీఫెన్ రవీంద్ర అంతర్రాష్ట్ర బదిలీ విషయంలో కేంద్ర హోంశాఖ సుముఖంగా లేదన్న భావన కూడా ఉంది. స్టీఫెన్ రవీంద్రకు ఇలాంటి మినహాయింపు ఇస్తే ఇలాంటి వినతులు మరిన్ని వస్తాయని… లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే హోంశాఖ నాన్చుతూ వస్తున్నట్టు చెబుతున్నారు.

కేంద్ర హోంశాఖ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ లీవ్‌లో ఉండడం ఇష్టంలేని స్టీఫెన్ రవీంద్ర తిరిగి పాత స్థానానికి వచ్చారు. అయితే ఫైల్ ఇంకా పరిశీలనలోనే ఉంది. ఒకవేళ కేంద్ర హోంశాఖ బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఏపీకి వెళ్లవచ్చని.. లేదంటే తెలంగాణలోనే పనిచేసుకుంటూ ఉండాలని స్టీఫెన్ రవీంద్ర నిర్ణయించుకున్నారు.

First Published:  4 Sep 2019 12:11 AM GMT
Next Story