సుకుమార్…. గెస్ట్ రోలా? వాయిస్ ఓవరా?

ఈ మధ్యనే ‘ఎఫ్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తమిళంలో సూపర్ హిట్టైన ‘జిగర్తాండ’ సినిమా రీమేక్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అధర్వ మురళి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ చూస్తే ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీస్తున్నారని అర్థమవుతోంది.

అయితే తాజాగా హరీశ్ శంకర్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “వాల్మీకి సినిమాలో సుకుమార్ నుంచి ఒక చిన్న సర్ ప్రైజ్ వుంది. డార్లింగ్ సుక్కుకి నా కృతజ్ఞతలు” అంటూ పోస్ట్ చేశాడు హరీష్ శంకర్.  అయితే ఈ సర్ ప్రైజ్ ఏంటా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఈ సినిమాలో సుకుమార్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడని కొందరు చెబుతుండగా మరి కొందరు సినిమాకి సుకుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చారేమో అని అంటున్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట మరియు గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతోంది.