Telugu Global
NEWS

నాలుగోటెస్ట్ తొలిరోజు ఆటకు వానదెబ్బ

ఆస్ట్ర్రేలియా 44 ఓవర్లలో 3 వికెట్లకు 170 పరుగులు స్టీవ్ స్మిత్ 60 పరుగుల స్కోరుతో బ్యాటింగ్ యాషెస్ సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్- ఆస్ట్ర్రేలియా జట్ల మధ్య ప్రారంభమైన నాలుగోటెస్ట్ తొలిరోజుఆటకు వానదెబ్బ తగిలింది. 90 ఓవర్లపాటు సాగాల్సిన ఆట కేవలం 44 ఓవర్లకే ముగిసింది. స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ 60 పరుగులు, ట్రావిస్ హెడ్ 18 పరుగుల స్కోర్లతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ..సిరీస్ కే […]

నాలుగోటెస్ట్ తొలిరోజు ఆటకు వానదెబ్బ
X
  • ఆస్ట్ర్రేలియా 44 ఓవర్లలో 3 వికెట్లకు 170 పరుగులు
  • స్టీవ్ స్మిత్ 60 పరుగుల స్కోరుతో బ్యాటింగ్

యాషెస్ సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్- ఆస్ట్ర్రేలియా జట్ల మధ్య ప్రారంభమైన నాలుగోటెస్ట్ తొలిరోజుఆటకు వానదెబ్బ తగిలింది.

90 ఓవర్లపాటు సాగాల్సిన ఆట కేవలం 44 ఓవర్లకే ముగిసింది. స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ 60 పరుగులు, ట్రావిస్ హెడ్ 18 పరుగుల స్కోర్లతో క్రీజులో ఉన్నారు.

అంతకుముందు ..సిరీస్ కే కీలకంగా మారిన ఈ టెస్టులో కంగారూ కెప్టెన్ టిమ్ పెయిన్ ముందుగా కీలక టాస్ నెగ్గి…బ్యాటింగ్ కు మెుగ్గు చూపాడు.

హారిస్- వార్నర్ ల జోడీతో బ్యాటింగ్ ప్రారంభించిన కంగారూ టీమ్ తొలి ఓవర్ నాలుగో బంతికే వార్నర్ వికెట్ కోల్పోయి ఎదురీత మొదలు పెట్టింది.

28 పరుగుల స్కోరుకే ఓపెనింగ్ జోడీ అవుట్ కావడంతో కంగారూటీమ్ ను ఆదుకొనే భాధ్యత మరోసారి వన్ డౌన్ లాబ్ సుజేన్, రెండో డౌన్ స్టీవ్ స్మితలపైన పడింది.

ఈ ఇద్దరూ మూడో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో పరిస్థితి మెరుగు పరచారు.

లాబ్ సుజేన్ 128 బాల్స్ లో 10 బౌండ్రీలతో 67 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో ఇంగ్లండ్ మూడో వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్ తో కలసి స్మిత్ తన పోరాటం కొనసాగించాడు.

స్టీవ్ స్మిత్ ఫైటింగ్ హాఫ్ సెంచరీ..

ప్రస్తుత సిరీస్ లో తాను ఆడిన రెండుటెస్టులు, మూడు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు, ఓ భారీ హాఫ్ సెంచరీ సాధించిన ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ 93 బాల్స్ లో 7 బౌండ్రీలతో 60 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

ఆట 44వ ఓవర్ తర్వాత కుండపోతగా వర్షం పడడంతో ఆటను రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఆస్ట్ర్రేలియా 44 ఓవర్లలో 3 వికెట్లకు 170 పరుగుల స్కోరుతో ఉంది.

కంగారూ టీమ్ తొలిఇన్నింగ్స్ లో 400కు పైగా స్కోరు సాధించగలిగితే…ఇంగ్లండ్ కు కష్ట్లాలు తప్పవు.

First Published:  4 Sep 2019 7:02 PM GMT
Next Story