Telugu Global
NEWS

టీడీపీలో కంభంపాటి క‌నిపించ‌డం లేదు... ఎందుకో!

కంభంపాటి రామ్మోహ‌న్‌ రావు. మొన్న‌టి వర‌కూ ఏపీ స‌ర్కార్‌కు ఢిల్లీలో ప్ర‌తినిధి. మాజీ రాజ్య‌స‌భ ఎంపీ. ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయిన త‌ర్వాత ఈయ‌న అక్క‌డ‌క్క‌డా కనిపించేవాడు. టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొనేవాడు. జగన్‌ ను నోటికొచ్చినట్లు మాట్లాడేవాడు. కానీ నెల‌రోజుల‌ నుంచి ఈయ‌న క‌నిపించ‌డం లేదు. టీవీ చర్చ‌ల‌కు రావ‌డం లేదు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనడం లేదు. టీడీపీకి ఈయ‌న కూడా గుడ్ బై చెప్ప‌బోతున్నాడని ప్ర‌చారం జ‌రుగుతోంది. సుజ‌నా, సీఎం ర‌మేష్ త‌ర‌హాలో ఈయ‌న కూడా కాషాయ […]

టీడీపీలో కంభంపాటి క‌నిపించ‌డం లేదు... ఎందుకో!
X

కంభంపాటి రామ్మోహ‌న్‌ రావు. మొన్న‌టి వర‌కూ ఏపీ స‌ర్కార్‌కు ఢిల్లీలో ప్ర‌తినిధి. మాజీ రాజ్య‌స‌భ ఎంపీ. ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయిన త‌ర్వాత ఈయ‌న అక్క‌డ‌క్క‌డా కనిపించేవాడు. టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొనేవాడు. జగన్‌ ను నోటికొచ్చినట్లు మాట్లాడేవాడు. కానీ నెల‌రోజుల‌ నుంచి ఈయ‌న క‌నిపించ‌డం లేదు. టీవీ చర్చ‌ల‌కు రావ‌డం లేదు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనడం లేదు.

టీడీపీకి ఈయ‌న కూడా గుడ్ బై చెప్ప‌బోతున్నాడని ప్ర‌చారం జ‌రుగుతోంది. సుజ‌నా, సీఎం ర‌మేష్ త‌ర‌హాలో ఈయ‌న కూడా కాషాయ కండువా క‌ప్పుకుంటాడని తెలుస్తోంది. ఇప్ప‌టికే బీజేపీ నేత‌ల ట‌చ్ లోకి వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఢిల్లీ లెవ‌ల్లో ఏదో ఒక ప‌ద‌వి ఇస్తే పార్టీలోకి వ‌స్తాన‌ని ష‌ర‌తు పెట్టిన‌ట్లు చెబుతున్నారు.

కంభంపాటి రాజ్య‌స‌భ సీటు ఆశించారు. కానీ ఆయ‌న‌కు రాలేదు. దీంతో అప్ప‌టినుంచి టీడీపీ వ్య‌వ‌హారాల్లో ఆయ‌న‌కు ప్రాధాన్య‌త పెరిగింది. రామోజీరావుతో ఉన్న సాన్నిహిత్యంతో ఢిల్లీలో ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధిగా ఈయనను నియ‌మించారు. దీంతో పార్టీ త‌ర‌పున టీవీ చ‌ర్చ‌ల్లో ఈయ‌న పాల్గొనేవాడు.

ఏపీలో టీడీపీ సీన్ అయిపోయింద‌ని అనుకుంటున్న నేత‌ల్లో ఈయ‌న ఒక‌డు. ఈయ‌న కూడా బీజేపీ వైపు చూస్తున్నాడట‌. ఇప్ప‌టికే వెంక‌య్య‌నాయుడు ఆశీస్సులతో క‌మ‌ల తీర్ధం త్వ‌ర‌లోనే పుచ్చుకుంటాడని తెలుస్తోంది.

First Published:  4 Sep 2019 11:52 PM GMT
Next Story