Telugu Global
National

పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు రెట్టింపు జరిమానా కట్టాలి

కొత్తగా సవరించిన మోటార్ వెహికిల్ (ఎంవి)యాక్ట్ వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నది. సెప్తెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ చట్టం ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి పెద్దమొత్తంలో జరిమాన వడ్డిస్తున్నది. అయితే ఢిల్లీ ప్రభుత్వం మరో కొత్త నిబంధనను విధించింది. దీని ప్రకారం చట్టాన్ని అమలు చేసే సిబంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఈ చట్టాన్ని అతిక్రమిస్తే రెట్టింపు జరిమానా కట్టాలి. కొత్త మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం గురుగాం లో ఓ ట్రాలీ డ్రైవర్ మద్యం […]

పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు రెట్టింపు జరిమానా కట్టాలి
X

కొత్తగా సవరించిన మోటార్ వెహికిల్ (ఎంవి)యాక్ట్ వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నది. సెప్తెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ చట్టం ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి పెద్దమొత్తంలో జరిమాన వడ్డిస్తున్నది.

అయితే ఢిల్లీ ప్రభుత్వం మరో కొత్త నిబంధనను విధించింది. దీని ప్రకారం చట్టాన్ని అమలు చేసే సిబంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఈ చట్టాన్ని అతిక్రమిస్తే రెట్టింపు జరిమానా కట్టాలి.

కొత్త మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం గురుగాం లో ఓ ట్రాలీ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినందుకు రూ.59,000 ఫైన్ వేశారు. ఓ పాత స్కూటర్ పై వెళుతున్న ఆసామికి ఢిల్లీ పోలీసులు రూ.2,3000 జరిమానా విధించడం తో దిమ్మెరపోయిన అతడు జరిమానా కన్నా తక్కువ విలువ (రూ.15000) కలిగిన తన స్కూటర్ ని వదులుకుని ఇంటికి చేరాడు.

చట్టం అమలు లోకి వచ్చిన నాలుగవ రోజు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తమ జాయింట్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఒక సర్క్యులర్ అందుకున్నారు. పోలీసులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే రెట్టింపు జరిమానా కట్టాలనేది అందులోని సారంశం.

ఇక నుంచి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తమ శరీరం పై కెమెరాలను ధరిస్తారు. అవి ఆటోమాటిక్ గా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిని రికార్డ్ చేస్తాయి. ఇప్పటికే అటువంటి 626 కెమెరాలను ట్రాఫిక్ పోలీసులకు అందచేశారు.

First Published:  5 Sep 2019 9:54 AM GMT
Next Story