అజిత్, విజయ్ అర్థం చేసుకున్నారట… ధనుష్ మాత్రం…

తమిళంలోనే కాకుండా సౌత్ ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ధనుష్ ఒకడు. అయితే ఒక నటుడిగా ధనుష్ ఇప్పటికే బోలెడు వివాదాల్లో ఇరుక్కున్నాడు.

అయితే తాజాగా ఇప్పుడు ధనుష్ మళ్లీ ఒక వివాదంలో ఇరుక్కున్నాడు. కొందరు ప్రముఖ నిర్మాతలు ధనుష్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ధనుష్ చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని వాళ్లు ఆరోపిస్తున్నారు.

నిజానికి ఇదంతా ధనుష్ ఇచ్చిన ఒక స్టేట్ మెట్ వల్లే మొదలైంది. ఈ మధ్య కాలంలో నిర్మాతల నుంచి రెమ్యూనరేషన్ తీసుకోవడం చాలా కష్టంగా మారిపోయిందని ధనుష్ ఈ మధ్యనే అన్నాడు.

ఈ నేపథ్యంలోనే ధనుష్ కామెంట్లకి రియాక్ట్ అయిన నిర్మాతలు ధనుష్ పై విరుచుకుపడుతున్నారు. ధనుష్ సినిమాలు ఈ మధ్య కాలంలో అంతగా ఆడకపోయినా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గటం లేదని, భారీగా రెమ్యూనరేషన్ అడుగుతున్నాడని…. ఆఖరికి అజిత్ మరియు విజయ్ వంటి స్టార్ హీరోలు కూడా నిర్మాతల పరిస్థితి అర్థం చేసుకొని ఇలాంటి బాధ్యతారహిత స్టేట్ మెంట్లు ఇవ్వడం లేదని… కానీ ధనుష్ మాత్రం ఇలా అనడం ఏమాత్రం బాగోలేదని వారు ఆరోపిస్తున్నారు. మరి ఇప్పుడు ధనుష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.