సాహో 6 రోజుల వసూళ్లు

భయపడినంత జరిగింది. సాహో వసూళ్లు ఘోరంగా పడిపోయాయి. చివరికి బంగారు బాతు అనుకున్న నైజాం నుంచి కూడా సాహోకు షేర్లు తగ్గిపోయాయి.

తాజా వసూళ్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కష్టమనే విషయం స్పష్టమైంది. నిన్నటితో 6 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 71 కోట్ల 63 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 125 కోట్ల రూపాయలకు అమ్మారు. మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 53 కోట్ల రూపాయలు కావాలి. రేపట్నుంచి సెకెండ్ వీక్ లోకి వస్తున్న ఈ సినిమా 53 కోట్లు కలెక్ట్ చేయడం దాదాపు అసాధ్యం. ఏపీ, నైజాంలో సాహో 6 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 25.24 కోట్లు
సీడెడ్ – రూ. 10.25 కోట్లు
ఉత్తరాంధ్ర -రూ. 8.75 కోట్లు
ఈస్ట్ – రూ. 6.62 కోట్లు
వెస్ట్ – రూ. 5.07 కోట్లు
గుంటూరు – రూ. 7.38 కోట్లు
నెల్లూరు – రూ. 3.82 కోట్లు
కృష్ణా – రూ. 4.70 కోట్లు