Telugu Global
Cinema & Entertainment

సాహో ఫలితంపై ప్రభాస్ మొదటి కామెంట్

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా దాదాపు 350 కోట్లు.. భారీ బడ్జెట్ భారీ అంచనాలతో ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన ఈ చిత్రంపై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం వచ్చాయన్నది సీనీ విశ్లేషకుల భావన.. అయితే ఇప్పటివరకు సినిమా ఫలితంపై చిత్ర యూనిట్ సభ్యులు స్పందించలేదు. సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. విడుదలైన వారం రోజులు అవుతున్నా దర్శకుడు సుజిత్, హీరో ప్రభాస్, నిర్మాతలు […]

సాహో ఫలితంపై ప్రభాస్ మొదటి కామెంట్
X

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా దాదాపు 350 కోట్లు.. భారీ బడ్జెట్ భారీ అంచనాలతో ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన ఈ చిత్రంపై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం వచ్చాయన్నది సీనీ విశ్లేషకుల భావన..

అయితే ఇప్పటివరకు సినిమా ఫలితంపై చిత్ర యూనిట్ సభ్యులు స్పందించలేదు. సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. విడుదలైన వారం రోజులు అవుతున్నా దర్శకుడు సుజిత్, హీరో ప్రభాస్, నిర్మాతలు స్పందించలేదు.

తాజాగా సినిమా ఫలితంపై సుజిత్ తన వివరణ ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా సాహో పై స్పందించాడు.

తాజాగా ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ లో సాహో 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని పోస్ట్ చేశారు. డియర్ ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్ సాహోపై మీరు చూపించిన ప్రేమ అభిమానానికి చాలా థ్యాంక్స్. మీవల్లే ఈ సినిమాకు మంచి గుర్తింపు దక్కింది’ అని చిన్నగా ఆనందంతో కూడిన కామెంట్ చేసి ముగించాడు.

First Published:  5 Sep 2019 10:32 AM GMT
Next Story