స్టార్ హీరోలకు రెమ్యూనరేషన్ వద్దట…

టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. కానీ గత కొంతకాలంగా కొందరు హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా ప్రాఫిట్ లలో కొంత భాగం తీసుకోవడం మొదలుపెట్టారు.

ఇప్పుడు తాజాగా హీరోలు నిర్మాతలుగా కూడా మారిపోయి సినిమా రైట్స్ ద్వారా వచ్చే మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మొదటిగా చెప్పుకోవాల్సిన పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. మామూలుగా అయితే స్టార్ హీరోలు పదిహేను నుంచి ఇరవై కోట్ల దాకా రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తూ ఉంటాడు. పెద్ద బడ్జెట్ సినిమా అయితే దానికి తగ్గట్టుగా రేట్లు పెంచుతూ ఉంటాడు.

తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం మాత్రం మహేష్ బాబు రెమ్యూనరేషన్ కాకుండా ఆ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ని తీసుకోబోతున్నాడట. అంతే కాకుండా ఈ సినిమా నిర్మాణం లో కూడా మహేష్ బాబు భాగస్వామ్యం అయ్యాడు.

మరోవైపు అల్లు అర్జున్ కూడా ‘అల వైకుంఠపురం లో’ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం తన హోమ్ బ్యానర్ గీతాఆర్ట్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు.

దీంతో స్టార్ హీరోలందరూ…. భారీగా ఆదాయం కోసం  ఇలా కొత్త దారులు చూసుకుంటున్నారు.