Telugu Global
NEWS

ఏపీకి రూ. 6వేల కోట్ల ఎన్‌డీబీ రుణం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి భారీగా రుణం మంజూరు చేసేందుకు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు – ఎన్‌డీబీ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డితో ఎన్‌డీబీ ప్రతినిధులు సమావేశమై రుణంపై చర్చించారు. ఏపీకి 6వేల కోట్ల రుణం ఇచ్చేందుకు గాను ప్రతిపాదనలను బ్యాంకు బోర్డు ముందుకు వెళ్తున్న విషయాన్ని సీఎంకు బ్యాంకు ప్రతినిధులు వివరించారు. రోడ్లను మెరుగుపరచడంతోపాటు, వివిధ ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. 32 సంవత్సరాల్లో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న […]

ఏపీకి రూ. 6వేల కోట్ల ఎన్‌డీబీ రుణం
X

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి భారీగా రుణం మంజూరు చేసేందుకు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు – ఎన్‌డీబీ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డితో ఎన్‌డీబీ ప్రతినిధులు సమావేశమై రుణంపై చర్చించారు. ఏపీకి 6వేల కోట్ల రుణం ఇచ్చేందుకు గాను ప్రతిపాదనలను బ్యాంకు బోర్డు ముందుకు వెళ్తున్న విషయాన్ని సీఎంకు బ్యాంకు ప్రతినిధులు వివరించారు. రోడ్లను మెరుగుపరచడంతోపాటు, వివిధ ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు.

32 సంవత్సరాల్లో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు, పరిశుభ్రమైన తాగునీరు సదుపాయాలు సహా రోడ్ల నిర్మాణం ప్రాజెక్టులకు మరింత సహాయం అందించాలని ముఖ్యమంత్రి బ్యాంకు ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. వీటి కోసం 25వేల కోట్ల రుణం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. అయితే గతంలో మంజూరు చేసిన రుణాన్ని గత ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టిందో తెలపాలని కూడా బ్యాంకు ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.

న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకును బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు 2015లో ఏర్పాటు చేశాయి. దీని కేంద్ర కార్యాలయం చైనాలో ఉంది.

First Published:  6 Sep 2019 12:20 AM GMT
Next Story