ప్రత్యర్థులు వరుసగా జైలుకు…. ఇప్పుడు టార్గెట్ కుమారస్వామి

చిదంబరం జైలుకు కెళ్లాడు. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా కేసుల్లో ఇరుక్కొని జైలుకెళ్లడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు బీజేపీ ప్రస్తుత టార్గెట్ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి. అవును.. తాజాగా ఈడీతో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ చాప్టర్ ను క్లోజ్ చేసిన బీజేపీ ఆయనపై 600 కోట్ల అక్రమ ఆస్తుల కేసులు పెట్టి లోపల వేయించింది.

ఇక ఇప్పుడు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తాజాగా మాజీ సీఎం కుమారస్వామి ఆస్తులపై విచారణ చేపట్టింది. ఆయనకు నోటీసులు ఇచ్చింది. 4న హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. బెంగళూరు శివారులోని వడ్డెరహల్లి గ్రామంలో మూడున్నర ఎకరాల స్థలం విరుద్దంగా డీనోటిఫై కుమారస్వామి చేశారన్నది ఆయనపై మోపిన ప్రధాన ఆరోపణ. స్వయంగా ఈ వ్యాజ్యాన్ని బీజేపీ నేత మహదేవ స్వామి కోర్టులో ఫిర్యాదు చేయడం విశేషం.

దీంతో బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కుమారస్వామి అని తేటతెల్లమైంది. బీజేపీకి కొరకరాని కొయ్యలుగా మారిన అందరినీ జైలుకు పంపడమే ధ్యేయంగా పెట్టుకున్న బీజేపీ ప్రస్తుత టార్గెట్ కుమారస్వామి అని అర్థమవుతోంది. మరి మాజీ సీఎం బీజేపీపై పోరాడుతారా? లొంగిపోయి జైలుకెళతారా? అన్నది వేచిచూడాలి.