800 కోట్లతో మణిరత్నం చేస్తున్న సాహసమిదే….

మణిరత్నం.. క్లాసిక్ డైరెక్టర్. ఎన్నో ప్రేమకథాచిత్రాలకు తెరపై ప్రాణం పోసిన దిగ్గజ దర్శకుడు. అయితే అన్ని రోజులు మనవి కానివన్నట్టు కాలంతో అప్ డేట్ కాలేక మణిరత్నం సినిమాల్లో వాడి వేడి తగ్గింది. దీంతో ఆయన సినిమాలు కొన్ని సంవత్సరాలుగా ఫ్లాప్ బాటపడుతున్నాయి.

అయితే సొంత కథలతో చేతులు కాల్చుకున్న మణిరత్నం తాజాగా ఓ కొత్త ప్రయోగం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నవలా రచయిత కల్కీ రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే తమిళ చరిత్ర నవల ఆధారంగా మణిరత్నం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏకంగా 800 కోట్లతో ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తూ సాహసం చేస్తున్నాడు.

ఈ బిగ్ ప్రాజెక్ట్ లో సౌత్-నార్త్ కు చెందిన స్టార్ నటీనటులను మణిరత్నం ఎంపిక చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి. ఈ ఏడాది ఎండింగ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సినిమాలో కార్తి, జయంరవి, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, కీర్తి సురేష్, అమలాపాల్ నటిస్తున్నట్టు సమాచారం.

ఇక దేశం గర్వించే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఈ చిత్రం కోసం కొత్తతరహా మ్యూజిక్ ఇవ్వబోతున్నాడట.. మొత్తం 12 పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా క్లాసికల్ స్టైల్లో డిఫెరెంట్ గా ప్లాన్ చేశాడట.. మరి ఇంత జాగ్రత్తగా తీయబోతున్న ఈ సినిమా మణిరత్నం కెరీర్ లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది వేచిచూడాలి.