Telugu Global
NEWS

యూఎస్ ఓపెన్ సెమీస్ లో స్పానిష్ బుల్

నాలుగో యూఎస్ టైటిల్ కు చేరువగా నడాల్ స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ 2019 అమెరికన్ ఓపెన్ టైటిల్ కు మరింత చేరువయ్యాడు. సెమీఫైనల్స్ చేరడం ద్వారా తన కెరియర్ లో నాలుగో యూఎస్ టైటిల్ కు గురిపెట్టాడు. న్యూయార్క్ ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టులో ముగిసిన ఆఖరి క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ నడాల్ 6-4, 7-5, 6-2తో అర్జెంటీనా ఆటగాడు డిగో ష్వార్జ్ మాన్ ను అధిగమించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొన్నాడు. క్లే కోర్టు […]

యూఎస్ ఓపెన్ సెమీస్ లో స్పానిష్ బుల్
X
  • నాలుగో యూఎస్ టైటిల్ కు చేరువగా నడాల్

స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ 2019 అమెరికన్ ఓపెన్ టైటిల్ కు మరింత చేరువయ్యాడు. సెమీఫైనల్స్ చేరడం ద్వారా తన కెరియర్ లో నాలుగో యూఎస్ టైటిల్ కు గురిపెట్టాడు.

న్యూయార్క్ ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టులో ముగిసిన ఆఖరి క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ నడాల్ 6-4, 7-5, 6-2తో అర్జెంటీనా ఆటగాడు డిగో ష్వార్జ్ మాన్ ను అధిగమించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొన్నాడు.

క్లే కోర్టు స్పెషలిస్ట్ నడాల్ కెరియర్ లో యూఎస్ ఓపెన్ సెమీస్ చేరడం ఇది ఎనిమిదోసారి. ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ సమరంలో ఇటలీ ఆటగాడు మాటియో బరెట్టీనీతో నడాల్ తలపడతాడు.

ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్, గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ టోర్నీ నుంచి నిష్క్ర్రమించడంతో… నడాల్ టైటిల్ విజయావకాశాలు మరింతగా మెరుగుపడ్డాయి.

తొలిసెమీఫైనల్లో బల్గేరియా ఆటగాడు గ్రిగోర్ దిమిత్రోవ్ తో రష్యా ఆటగాడు డానిల్ మెద్వదేవ్ పోటీపడతాడు.

2010, 2013, 2017 సంవత్సరాలలో యూఎస్ టైటిల్ నెగ్గిన రాఫెల్ నడాల్…నాలుగోసారి విజేతగా నిలవడానికి తహతహలాడుతున్నాడు.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో ఫెదరర్ అత్యధికంగా 20 టైటిల్స్ నెగ్గితే…33 ఏళ్ల నడాల్ 18 టైటిల్స్ తో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

First Published:  5 Sep 2019 8:30 PM GMT
Next Story