Telugu Global
NEWS

భారత మహిళా టీ-20 జట్టులో 15 ఏళ్ల బాలిక

హర్యానా టీనేజర్ షెఫాలీ వర్మకు చాన్స్ సౌతాఫ్రికాతో 24 నుంచి టీ-20 సిరీస్ సౌతాఫ్రికాతో ఈనెల 24న ప్రారంభమయ్యే టీ-20 సిరీస్ లో పాల్గొనే భారత మహిళాజట్టులో హర్యానా బాలిక , 15 ఏళ్ల షెఫాలీ వర్మకు చోటు దక్కింది. వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ టీ-20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రెండురోజుల వ్యవధిలోనే…హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో జట్టును ప్రకటించారు. డాషింగ్ ఓపెనర్ స్మృతి మంథానా వైస్ కెప్టెన్ గా ఉన్న జట్టులోని ఇతర సభ్యుల్లో […]

భారత మహిళా టీ-20 జట్టులో 15 ఏళ్ల బాలిక
X
  • హర్యానా టీనేజర్ షెఫాలీ వర్మకు చాన్స్
  • సౌతాఫ్రికాతో 24 నుంచి టీ-20 సిరీస్

సౌతాఫ్రికాతో ఈనెల 24న ప్రారంభమయ్యే టీ-20 సిరీస్ లో పాల్గొనే భారత మహిళాజట్టులో హర్యానా బాలిక , 15 ఏళ్ల షెఫాలీ వర్మకు చోటు దక్కింది.

వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ టీ-20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రెండురోజుల వ్యవధిలోనే…హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో జట్టును ప్రకటించారు.

డాషింగ్ ఓపెనర్ స్మృతి మంథానా వైస్ కెప్టెన్ గా ఉన్న జట్టులోని ఇతర సభ్యుల్లో జెమీమా రోడ్రిగేస్, దీప్తీ శర్మ, తాన్యా భాటియా, పూనమ్ యాదవ్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రకర్, రాధా యాదవ్,వేదా కృష్ణమూర్తి, హర్లీన్ డియోల్, అనూజా పాటిల్, షెఫాలీ వర్మ, మానసి జోషీ ఉన్నారు.

హార్డ్ హిట్టర్ షెఫాలీ…

హర్యానా నుంచి భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన షెఫాలీకి వీరబాదుడు బ్యాట్స్ విమెన్ గా పేరుంది. కేవలం 15 ఏళ్ల చిరుప్రాయంలోనే భారీషాట్లతో విరుచుకుపడే నేర్పు షెఫాలకీ ఉంది.

మూడుజట్ల టీ-20 చాలెంజ్ లీగ్ లో మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ జట్టు లో సభ్యురాలిగా పాల్గొన్న షెఫాలీ తన బ్యాటింగ్ పవర్ ఏంటో చాటిచెప్పడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకట్టుకొంది. వెటరన్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో..ఆ స్థానంలో షెఫాలీకి చోటు కల్పించారు.

సౌతాఫ్రికాతో పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లోని తొలిమ్యాచ్ సూరత్ వేదికగా ఈనెల 24న జరుగుతుంది.సిరీస్ లోని రెండు, మూడు టీ-20 మ్యాచ్ లు సెప్టెంబర్ 26, 29 తేదీలలో నిర్వహిస్తారు.

సిరీస్ లోని నాలుగో టీ-20 అక్టోబర్ 1న, ఆఖరి టీ-20 అక్టోబర్ 4న జరుగుతాయి.

First Published:  6 Sep 2019 12:24 AM GMT
Next Story