Telugu Global
Cinema & Entertainment

సాహో వారం రోజుల వసూళ్లు

సాహో సినిమా మొత్తానికి మొదటి వారం పూర్తిచేసుకుంది. బాహుబలి-2ను క్రాస్ చేస్తుందనుకున్న ఈ సినిమా వారం తిరిగేసరికి బొక్కబోర్లా పడింది. బాహుబలి-2ను క్రాస్ చేయడం మాట అటుంచి, బ్రేక్ ఈవెన్ అవ్వడానికి అపసోపాలు పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 7 రోజుల్లో 74 కోట్ల 18 లక్షల రూపాయల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 50 కోట్ల రూపాయలు కావాలి. ఇవాళ్టి నుంచి సాహోకు థియేటర్లు తగ్గిపోయాయి. మార్కెట్లోకి మరో 7 సినిమాలు […]

సాహో వారం రోజుల వసూళ్లు
X

సాహో సినిమా మొత్తానికి మొదటి వారం పూర్తిచేసుకుంది. బాహుబలి-2ను క్రాస్ చేస్తుందనుకున్న ఈ సినిమా వారం తిరిగేసరికి బొక్కబోర్లా పడింది. బాహుబలి-2ను క్రాస్ చేయడం మాట అటుంచి, బ్రేక్ ఈవెన్ అవ్వడానికి అపసోపాలు పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 7 రోజుల్లో 74 కోట్ల 18 లక్షల రూపాయల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 50 కోట్ల రూపాయలు కావాలి.

ఇవాళ్టి నుంచి సాహోకు థియేటర్లు తగ్గిపోయాయి. మార్కెట్లోకి మరో 7 సినిమాలు రావడంతో వాటికి థియేటర్లు ఇవ్వడంతో, సాహో స్క్రీన్ కౌంట్ 60శాతానికి పడిపోయింది. దీంతో ఈ సినిమాకు ఏపీ, నైజాంలో కలుపుకొని అదనంగా 50 కోట్లు రావడం కష్టమైన వ్యవహారంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వారం రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 26.22 కోట్లు
సీడెడ్ – రూ. 10.78 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.93 కోట్లు
ఈస్ట్ – రూ. 6.90 కోట్లు
వెస్ట్ – రూ. 5.30 కోట్లు
గుంటూరు – రూ. 7.46 కోట్లు
నెల్లూరు – రూ. 3.89 కోట్లు
కృష్ణా – రూ. 4.70 కోట్లు

First Published:  6 Sep 2019 2:48 AM GMT
Next Story