సై రా…. ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రస్తుతం ఫిలిం నగర్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు సై రా నరసింహ రెడ్డి సినిమాని దాదాపు గా ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయల వరకు అమ్మారు అని తెలుస్తోంది.

కేవలం ఒక సీడెడ్ ప్రాంతంలోనే సినిమా కి 22 కోట్ల ధర పలికిందని సమాచారం. అయితే ఉత్తరాంద్ర ప్రాంతం లో ఈ సినిమాని 14.4 కోట్లకి కొనుక్కున్నారట బయ్యర్లు. గుంటూరు మరియు వెస్ట్ గోదావరి లో 11.50 కోట్లకి, మరియు 8.40 కోట్ల కి సినిమా ని అమ్మేసారట దర్శక నిర్మాతలు.

నెల్లూరు లో ఈ సినిమా 4.80 కోట్లకి అమ్ముడు పోగా కృష్ణ ప్రాంతం లో దాదాపు గా ఎనిమిదిన్నర కోట్ల ధర పలికిందట. ఇంకా ఈస్ట్ గోదావరి నుంచి ఒక పదిన్నర కోట్ల ధర ఈ సినిమా కి పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రా ప్రాంతంలో ఈ సినిమా కి దాదాపు గా 80 కోట్ల వరకు వచ్చిందని తెలుస్తోంది.

బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం కేవలం ఈ సినిమా కి మాత్రమే చెల్లింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బిజినెస్ జరుగుతుంది. పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది.