బన్నీ సినిమాకు నవంబర్ నుంచే ప్రచారం

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురం అనే సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమా టోటల్ షూటింగ్ డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ సినిమా ప్రచారాన్ని నవంబర్ నుంచే స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. తొలి విడత ప్రచారంలో భాగంగా నవంబర్ లోనే పాటల హంగామా షురూ కాబోతోంది. ఈ విషయాన్ని తమన్ అధికారికంగా ప్రకటించాడు.

అల వైకుంఠపురం సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను నవంబర్ లో రిలీజ్ చేస్తామని తమన్ ప్రకటించాడు. అంటే నవంబర్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు దశలవారీగా పాటలు విడుదలవుతున్నాయన్నమాట.

డిసెంబర్ మొదటి వారంలో టీజర్, ఆ వెంటనే ట్రయిలర్ రిలీజ్ చేసి.. అదే ఊపులో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా చేయాలని నిర్ణయించారు. ఇలా బన్నీ-త్రివిక్రమ్ సినిమా కాస్త వేగం పుంజుకుందన్నమాట.

మొన్నటివరకు మహేష్ సినిమా దూకుడు మీద ఉండేది. ఈ మూవీ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తూ అనీల్ రావిపూడి దూసుకుపోయాడు. ఇప్పుడు సరివేరు నీకెవ్వరు సినిమాకు పోటీగా అల వైకుంఠపురం సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ రెండు సినిమాల మధ్యే పోటీ ఉండబోతోంది.

ప్రస్తుతం బన్నీ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ ఇంటి సెట్ లో జోరుగా సాగుతోంది. సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ఫిలింసిటీలో జరుగుతోంది.