Telugu Global
National

అందినట్టే అంది... ఆఖరిలో తెగిపోయిన ల్యాండర్‌ సిగ్నల్

చంద్రయాన్‌-2 ప్రయోగంలో అనుకోని ఆటంకం ఎదురైంది. పక్రియ మొత్తం సవ్యంగా సాగినా ఆఖరి నిమిషాల్లో సమస్య తలెత్తింది. చంద్రుడికి అతి సమీపంగా వెళ్లిన తర్వాత ల్యాండర్‌ నుంచి సిగ్నల్స్ తెగిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరుత్సాహానికి గురయ్యారు. చంద్రుడికి 2.1 కిలోమీటర్ వరకు ల్యాండర్ ప్రయాణం సవ్యంగానే సాగింది. చంద్రుడి మీద ల్యాండర్ దిగే దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రధాని మోడీ స్వయంగా షార్ కేంద్రానికి వచ్చారు. అయితే చంద్రుడికి 2.1 కిలో మీటర్ల దూరంలో ఉండగా ల్యాండర్‌ […]

అందినట్టే అంది... ఆఖరిలో తెగిపోయిన ల్యాండర్‌ సిగ్నల్
X

చంద్రయాన్‌-2 ప్రయోగంలో అనుకోని ఆటంకం ఎదురైంది. పక్రియ మొత్తం సవ్యంగా సాగినా ఆఖరి నిమిషాల్లో సమస్య తలెత్తింది. చంద్రుడికి అతి సమీపంగా వెళ్లిన తర్వాత ల్యాండర్‌ నుంచి సిగ్నల్స్ తెగిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరుత్సాహానికి గురయ్యారు. చంద్రుడికి 2.1 కిలోమీటర్ వరకు ల్యాండర్ ప్రయాణం సవ్యంగానే సాగింది. చంద్రుడి మీద ల్యాండర్ దిగే దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రధాని మోడీ స్వయంగా షార్ కేంద్రానికి వచ్చారు. అయితే చంద్రుడికి 2.1 కిలో మీటర్ల దూరంలో ఉండగా ల్యాండర్‌ నుంచి సిగ్నల్స్ నిలిచిపోయాయి.

పరిస్థితిని ప్రధానికి ఇస్రో చైర్మన్‌ శివన్ వివరించారు. ల్యాండర్ నుంచి సిగ్నల్స్ తెగిపోయాయని సమస్యను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ ధైర్యం చెప్పారు. జీవితంలో జయాపజయాలు సహజమని… ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు సాధించింది తక్కువేమీ కాదని ప్రధాని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో విజయం సాధించే దిశగా అడుగులు వేద్దామని… ఇందుకు దేశం మొత్తం శాస్త్రవేత్తల వెంట ఉంటుందని మోడీ చెప్పారు.

చంద్రుడికి 2.1 కిలోమీటర్ల వరకు విజయవంతంగా సాగిన విక్రమ్ ల్యాండర్ ప్రయాణం ఆ తర్వాత హఠాత్తుగా కుదుపుకు గురైనట్టు భావిస్తున్నారు. దాని వల్లే ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ ఆగిపోయాయి. ఇలా ఎందుకు జరిగింది అన్న దానిపై శాస్త్రవేత్తలు అప్పటి వరకు అందిన సిగ్నల్స్ ఆధారంగా పరిశీలన చేస్తున్నారు. తిరిగి ల్యాండర్‌తో అనుసంధానం సాధించడం సాధ్యమా కాదా అన్న దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ల్యాండర్ చంద్రుడిని తాకే ఘట్టాన్ని వీక్షించేందుకు దూరదర్శన్‌ శుక్రవారం అర్ధరాత్రి 1.10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం అందించింది. ఇస్రో తన వెబ్‌సైట్‌లోనూ కార్యక్రమ లైవ్‌ వీడియోను అందించింది. అయితే ల్యాండర్ నుంచి సిగ్నల్స్ బ్రేక్ అయ్యాయని తెలియగానే కోట్లాది మంది భారతీయులు నిరాశకు లోనయ్యారు.

First Published:  6 Sep 2019 8:28 PM GMT
Next Story