సైరా షూటింగ్ లో చాలా సార్లు కోపడ్డాడట

ఈ మధ్యనే ‘ఖైదీనెంబర్150’ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ లో అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, వంటి స్టార్ కాస్ట్ మాత్రమే కాకుండా స్టార్ టెక్నీషియన్లు కూడా పనిచేశారు.

‘రోబో’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన రత్నవేలు ఈ సినిమాకి కూడా చక్కని అవుట్ పుట్ ఇచ్చారని సమాచారం.

ఈ సినిమా గురించి మాట్లాడుతూ…. కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు రత్నవేలు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకి చాలా సార్లు కోపం వచ్చిందని వెల్లడించారు.

ఏడాదికి పైగా ఈ సినిమా కోసం సమయం కేటాయించానని చెప్పిన రత్నవేలు కొన్ని కొన్ని సార్లు షూటింగ్ జరుగుతున్నప్పుడు కొందరిపై కోపడ్డాడట. గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తుండడంతో అందరిపైనా వర్క్ ప్రెజర్ పెరిగిపోయిందని, అందువల్ల కొన్నిసార్లు ఆగ్రహానికి లోనైనట్లు తెలిపాడు రత్నవేలు.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో రామ్ చరణ్ తో తనకి మంచి స్నేహం ఏర్పడింది అని చెప్పుకొచ్చాడు.