Telugu Global
NEWS

టీ-20లో 100 వికెట్ల తొలి బౌలర్ మలింగ

న్యూజిలాండ్ పై 4 బాల్స్ లో 4 వికెట్లతో రికార్డు శ్రీలంక యార్కర్ల కింగ్ లాసిత్ మలింగ… ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచరికార్డు నెలకొల్పాడు. 100 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన తొలిబౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. క్యాండీ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో మలింగ ఈ ఘనత సంపాదించాడు. పాక్ లెగ్ స్పిన్నర్ షాహీద్ ఆఫ్రిదీ పేరుతో ఉన్న 97 వికెట్ల ప్రపంచ రికార్డును మలింగ తెరమరుగు చేశాడు. 2007లోనే వన్డే క్రికెట్లో […]

టీ-20లో 100 వికెట్ల తొలి బౌలర్ మలింగ
X
  • న్యూజిలాండ్ పై 4 బాల్స్ లో 4 వికెట్లతో రికార్డు

శ్రీలంక యార్కర్ల కింగ్ లాసిత్ మలింగ… ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచరికార్డు నెలకొల్పాడు. 100 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన తొలిబౌలర్ గా రికార్డు నెలకొల్పాడు.

క్యాండీ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో మలింగ ఈ ఘనత సంపాదించాడు. పాక్ లెగ్ స్పిన్నర్ షాహీద్ ఆఫ్రిదీ పేరుతో ఉన్న 97 వికెట్ల ప్రపంచ రికార్డును మలింగ తెరమరుగు చేశాడు.

2007లోనే వన్డే క్రికెట్లో వంద వికెట్ల మైలురాయిని చేరిన మలింగ…టీ-20లో సైతం అదే రికార్డు సాధించడం విశేషం. తన కెరియర్ లో కేవలం 76వ టీ-20 మ్యాచ్ లోనే కివీ ఓపెనర్ కోలిన్ మున్రోను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా వికెట్ల సెంచరీ పూర్తి చేశాడు.

అంతకు ముందు కోలిన్ గ్రాండ్ హోమీ, హామిష్ రూథర్ ఫోర్డ్, రోజ్ టేలర్ లను పెవీలియన్ దారి పట్టించాడు.

2011లో టెస్ట్ క్రికెట్ కు, 2019 జులైలో వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మలింగ..టీ-20 క్రికెట్లో మాత్రం కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనడమే లక్ష్యంగా మలింగ తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు.

2006లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా టీ-20 అరంగేట్రం చేసిన మలింగకు ..30 టెస్టులో 101 వికెట్లు, 226 వన్డేల్లో 338 వికెట్లు పడగొట్టిన రికార్డులు సైతం ఉన్నాయి.

First Published:  7 Sep 2019 5:00 AM GMT
Next Story