Telugu Global
Cinema & Entertainment

ఒకే సినిమా... 2 ఫస్ట్ లుక్స్

ఫస్ట్ లుక్ అంటే ఒకే పోస్టర్ ఉండాలి. కానీ ఈమధ్య ఫస్ట్ లుక్ అంటూ రెండు పోస్టర్లు విడుదల చేయడం కామన్ అయిపోయింది. గతంలో నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు సినిమాకు ఈ పద్ధతి ఫాలో అయ్యారు. రీసెంట్ గా అల వైకుంఠపురం సినిమాకు కూడా ఇలానే వ్యవహరించారు. ఇప్పుడు రాగల 24 గంటల్లో అనే సినిమాకు కూడా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పేరిట 2 డిఫరెంట్ పోస్టర్లు విడుదల చేశారు. First look […]

ఒకే సినిమా... 2 ఫస్ట్ లుక్స్
X

ఫస్ట్ లుక్ అంటే ఒకే పోస్టర్ ఉండాలి. కానీ ఈమధ్య ఫస్ట్ లుక్ అంటూ రెండు పోస్టర్లు విడుదల చేయడం కామన్ అయిపోయింది. గతంలో నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు సినిమాకు ఈ పద్ధతి ఫాలో అయ్యారు. రీసెంట్ గా అల వైకుంఠపురం సినిమాకు కూడా ఇలానే వ్యవహరించారు. ఇప్పుడు రాగల 24 గంటల్లో అనే సినిమాకు కూడా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పేరిట 2 డిఫరెంట్ పోస్టర్లు విడుదల చేశారు.

సత్యదేవ్, ఈషా రెబ్బ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం రాగల 24 గంటల్లో. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లను తాజాగా విడుదల చేశారు. ఆ రెండు పోస్టర్లకు అద్భుతమైన స్పందన వస్తోంది. టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్లతో కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. ఢమరుకం సినిమాను తీసిన శ్రీనివాసరెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. శ్రీరామ్, ముస్కాన్ సేథి, గణేశ్ వెంకట్రామన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

స్క్రీన్ ప్లే బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ తో పాటు గరుడవేగ ఫేమ్ అంజి కెమెరావర్క్ ఈ సినిమాకు మరో హైలెట్ గా నిలవనుంది. రఘు కుంచె ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.

First Published:  7 Sep 2019 12:27 AM GMT
Next Story