రాజమౌళి కోసం…. సై రా స్పెషల్ షో?

రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా కి పని చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో నే ఒక ప్రతిష్టాత్మక చిత్రం గా తెరకెక్కుతోంది. అంతే కాకుండా ఈ ఏడాది లో విడుదల కానున్న సై రా నరసింహ రెడ్డి చిత్రం కూడా అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం అనే విషయం అందరికీ తెలిసిందే.

మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర లో వస్తున్న ఈ సినిమా కి దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమా కి సంబందించిన మొదటి షో ని చిత్ర యూనిట్ రాజమౌళి కి చూపించాలని అనుకుంటున్నారట దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమా ఎప్పుడు చూపిస్తారు అనే దాని పైన క్లారిటీ లేదు కానీ రాజమౌళి మాత్రం ఈ సినిమాని చూసి తన ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారట.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి బజ్ చాలా ఎక్కువగా వినిపిస్తుంది. కర్నూల్ లో ఈ సినిమా ఈవెంట్ జరుగుతుంది అని వినికిడి.

అయితే రామ్ చరణ్ త్వరగా ఈ సినిమా కి సంబంధించి ఫైనల్ కాపీ రెడీ చేసి రాజమౌళి కి చూపించి తన అభిప్రాయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాడట.