“అందరూ అమ్మ దగ్గర ఉండకపోవచ్చు…. కానీ అమ్మ కడుపు ని మించిన అడ్రస్ ప్రూఫ్ ఎవరికీ ఉండదు”….

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, మాటలు అందించారు. అయితే ఈ సినిమా అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్యన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయిమాధవ్ బుర్రా సైరా సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన డైలాగ్ ను లీక్ చేశారు. “అందరూ అమ్మ దగ్గర ఉండకపోవచ్చు కానీ అమ్మ కడుపు ని మించిన అడ్రస్ ప్రూఫ్ ఎవరికీ ఉండదు” అని సైరా సినిమాలో చిరంజీవి క్లైమాక్స్ లో చెబుతారని అన్నారు.

కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.