Telugu Global
NEWS

యూఎస్ ఓపెన్ ఫైనల్లో రాఫెల్ నడాల్

ఫైనల్లో మెద్వదేవ్ తో రఫా అమీతుమీ ఐదోసారి యూఎస్ ఫైనల్లో స్పానిష్ బుల్ అమెరికన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ ఐదోసారి చేరుకొన్నాడు. రెండోసీడ్ గా టైటిల్ వేటకు దిగిన క్లేకోర్టు కింగ్ నడాల్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోడం ద్వారా నాలుగో యూఎస్ టైటిల్ కు గురిపెట్టాడు. ప్రపంచంలోనే అతిపెద్ద టెన్నిస్ వేదిక న్యూయార్క్ ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టులో ముగిసిన ఆఖరి సెమీఫైనల్లో రెండో సీడ్ నడాల్ […]

యూఎస్ ఓపెన్ ఫైనల్లో రాఫెల్ నడాల్
X
  • ఫైనల్లో మెద్వదేవ్ తో రఫా అమీతుమీ
  • ఐదోసారి యూఎస్ ఫైనల్లో స్పానిష్ బుల్

అమెరికన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ ఐదోసారి చేరుకొన్నాడు. రెండోసీడ్ గా టైటిల్ వేటకు దిగిన క్లేకోర్టు కింగ్ నడాల్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోడం ద్వారా నాలుగో యూఎస్ టైటిల్ కు గురిపెట్టాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద టెన్నిస్ వేదిక న్యూయార్క్ ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టులో ముగిసిన ఆఖరి సెమీఫైనల్లో రెండో సీడ్ నడాల్ 7-6, 6-4, 6-1తో ఇటలీ ఆటగాడు మాటియో బెర్టినీని ఆధిగమించాడు.

నడాల్ తన కెరియర్ లో యూఎస్ ఓపెన్ సెమీస్ కు ఎనిమిదోసార్లు చేరడమే కాదు…ఫైనల్స్ కు ఐదోసారి అర్హత సంపాదించాడు.
ఫైనల్లో రష్యా ఆటగాడు, 5వ సీడ్ డానిల్ మెద్వదేవ్ తో నడాల్ తలపడతాడు.

డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్, గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్ర్రమించడంతో…నడాల్ టైటిల్ విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

2010, 2013, 2017 సంవత్సరాలలో యూఎస్ టైటిల్ నెగ్గిన రాఫెల్ నడాల్…నాలుగోసారి విజేతగా నిలవడానికి తహతహలాడుతున్నాడు.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో ఫెదరర్ అత్యధికంగా 20 టైటిల్స్ నెగ్గితే…33 ఏళ్ల నడాల్ 18 టైటిల్స్ తో ఫెదరర్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

First Published:  7 Sep 2019 12:16 AM GMT
Next Story