Telugu Global
NEWS

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో టైటిల్ సమరం

నువ్వానేనా అంటున్న సెరెనా, బియాంకా టైటిల్ నెగ్గితే ట్రోఫీతో పాటు 27 కోట్ల 40 లక్షల ప్రైజ్ మనీ ప్రపంచ టెన్నిస్ అభిమానులను గత కొద్దిరోజులుగా ఆలరిస్తున్న 2019 యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ఫైట్ కు… న్యూయార్క్ లోని అర్ధర్ యాష్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మరికొద్ది గంటల్లో జరిగే ఈ సూపర్ డూపర్ ఫైట్ లో ఆరు సార్లు విజేత, 37 ఏళ్ల వెటరన్ సెరెనా విలియమ్స్ కు కెనడా టీనేజర్ బియాంకా […]

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో టైటిల్ సమరం
X
  • నువ్వానేనా అంటున్న సెరెనా, బియాంకా
  • టైటిల్ నెగ్గితే ట్రోఫీతో పాటు 27 కోట్ల 40 లక్షల ప్రైజ్ మనీ

ప్రపంచ టెన్నిస్ అభిమానులను గత కొద్దిరోజులుగా ఆలరిస్తున్న 2019 యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ఫైట్ కు… న్యూయార్క్ లోని అర్ధర్ యాష్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

మరికొద్ది గంటల్లో జరిగే ఈ సూపర్ డూపర్ ఫైట్ లో ఆరు సార్లు విజేత, 37 ఏళ్ల వెటరన్ సెరెనా విలియమ్స్ కు కెనడా టీనేజర్ బియాంకా యాండ్రెస్కూ సవాలు విసురుతోంది.

తల్లిహోదాలో మరో ఫైనల్లో సెరెనా..

గత ఏడాది మృత్యువుతో పోరాడి ఓ బిడ్డకు జన్మనిచ్చిన అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా..తల్లి హోదాలో తొలిటైటిల్ కోసం తహతహలాడుతోంది.

తన కెరియర్ లో ఇప్పటికే ఆరు యూఎస్ టైటిల్స్ తో పాటు 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన సెరెనా… మరో టైటిల్ నెగ్గితే… మార్గారెట్ కోర్టు పేరుతో ఉన్న 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ రికార్డును సమం చేయగలుగుతుంది. తన వయసులో సగం మాత్రమే ఉన్న బియాంకా యాండ్రెస్కూ నుంచి సెరెనా గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశాలున్నాయి.

కెనడా సంచలనం బియాంకా…

మహిళా టెన్నిస్ సర్క్యూట్ లో సంచలనాలకు మరో పేరుగా నిలిచిన కెనడా వండర్ గాళ్ 18 ఏళ్ల బియాంకా పవర్ టెన్నిస్ తో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. తన కెరియర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

ఫైనల్లో సెరెనా లాంటి ప్రత్యర్థితో ఢీ కొనాలని తాను కలలు కన్నానని.. ఇప్పటికి నెరవేరిందని బియాంకా చెబుతోంది. టైటిల్ సమరం కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది.

27 కోట్ల 40 లక్షల ప్రైజ్ మనీ…

యూఎస్ ఓపెన్ టైటిల్ విజేత కోసం భారీ ప్రైజ్ మనీ ఎదురుచూస్తోంది.విన్నర్ గా నిలిచిన ప్లేయర్ కు ట్రోఫీతో పాటు 27 కోట్ల 40 లక్షల రూపాయలు, రన్నరప్ కు 13 కోట్ల 20 లక్షల రూపాయలు నజరానగా ఇస్తారు.

ప్రస్తుత ఫైనల్లో విజేతగా ఎవరు నిలిచినా అది సరికొత్త రికార్డుగా నిలిచిపోతుంది.

First Published:  7 Sep 2019 12:20 AM GMT
Next Story