Telugu Global
NEWS

చెప్పిన మాట నిలబెట్టుకున్నాను

“నేను పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నా వంద రోజుల పాలనలో అమలు చేస్తున్నాను. పాదయాత్రతో పాటు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ నెరవేరుస్తున్నాను. మాట తప్పలేదు. మడమ తిప్పలేదు” అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పలాస లో జరిగిన భారీ బహిరంగ సభలో చెప్పారు. బియ్యం పంపిణీ వ్యవస్థను పూర్తిగా మార్చి వేస్తున్నామని, గత ప్రభుత్వంలో సరఫరా చేసినట్లుగా ముక్కిపోయిన బియ్యాన్ని కాకుండా అందరూ తినగలిగే బియ్యాన్ని సరఫరా చేస్తామని ఈ సందర్భంగా […]

చెప్పిన మాట నిలబెట్టుకున్నాను
X

“నేను పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నా వంద రోజుల పాలనలో అమలు చేస్తున్నాను. పాదయాత్రతో పాటు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ నెరవేరుస్తున్నాను. మాట తప్పలేదు. మడమ తిప్పలేదు” అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పలాస లో జరిగిన భారీ బహిరంగ సభలో చెప్పారు.

బియ్యం పంపిణీ వ్యవస్థను పూర్తిగా మార్చి వేస్తున్నామని, గత ప్రభుత్వంలో సరఫరా చేసినట్లుగా ముక్కిపోయిన బియ్యాన్ని కాకుండా అందరూ తినగలిగే బియ్యాన్ని సరఫరా చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. నాణ్యమైన బియ్యాన్ని మహిళలకు అందించి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

తాను పాదయాత్ర చేసిన సమయంలో పలాస చుట్టుపక్కల ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు తనను కలిశారని, వారి బాధలు, విన్నపాలు తెలుసుకున్న తాను అధికారంలోకి రాగానే వారి కష్టాలను కడతేరుస్తానని హామీ ఇచ్చానని చెప్పారు. “కిడ్నీ బాధితుల గోడు విన్నాను. అప్పుడు వారికి ధైర్యం చెప్పాను. చెప్పినట్లుగానే కిడ్నీ బాధితుల కోసం పలాసలో 200 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నాం” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల కిడ్నీసూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

పలాస బహిరంగ సభలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కిడ్నీ బాధితులకు ప్రతి నెలా 10,000 రూపాయల పెన్షన్ ఇస్తామని, ప్రతి 500 మంది సికేడి లకు ఒక హెల్త్ వర్కర్ ను నియమిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కిడ్నీ బాధితులకు, వారి సహాయకులకు ఉచిత బస్ పాస్ ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన వైద్య పరీక్షలను, నాణ్యమైన మందులను కూడా ఉచితంగానే ఇస్తామని ప్రకటించారు. కిడ్నీ వ్యాధిగస్త్రులకు నిలయమైన ఉద్దానం ప్రాంతంలో 600 కోట్ల రూపాయలతో చేపడుతున్న శుద్ధ జలాల సరఫరా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

జిల్లాలో విస్తారంగా సముద్ర తీరం ఉందని, ఆ తీరాన్నినమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు 50 శాతం డీజిల్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం రూ.11.95 కోట్లతో నిర్మించనున్న జెట్టీ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఇక ఉత్తరాంధ్ర జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బుడగ జంగాలకు, బెంతోరియాల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కమిషన్ నియమిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అందుకోసం వెంటనే చర్యలు తీసుకోవాలని వేదిక మీదే కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లాను అతలాకుతలం చేసిన తితిలీ తుపాను బాధితులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు.

First Published:  7 Sep 2019 12:23 AM GMT
Next Story