Telugu Global
Others

నిర్లక్ష్యంవల్లే వరద బీభత్సం

ఈ ఏడాది వరద బీభత్సంవల్ల మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం అంతకు ముందు సంవత్సరం కన్నా చాలా భయంకరమైంది. ఈ ఏడాది కలిగిన నష్టం కేవలం పశ్చిమ కనుమల్లోని కొండ ప్రాంతాలకే పరిమితం కాలేదు. కర్నాటకలోని బెలగావి, మహారాష్ట్రలోని కొళాపూర్, సతారా, సాంగ్లీ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాలూ నీట మునిగిపోవడంవల్ల అపార నష్టం కలిగింది. కొన్ని ప్రాంతాలు 12 నుంచి 15 అడుగుల లోతు నీళ్లల్లో మునిగిపోయాయి. 4.7 లక్షల మంది శహాయక […]

నిర్లక్ష్యంవల్లే వరద బీభత్సం
X

ఈ ఏడాది వరద బీభత్సంవల్ల మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం అంతకు ముందు సంవత్సరం కన్నా చాలా భయంకరమైంది. ఈ ఏడాది కలిగిన నష్టం కేవలం పశ్చిమ కనుమల్లోని కొండ ప్రాంతాలకే పరిమితం కాలేదు. కర్నాటకలోని బెలగావి, మహారాష్ట్రలోని కొళాపూర్, సతారా, సాంగ్లీ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాలూ నీట మునిగిపోవడంవల్ల అపార నష్టం కలిగింది. కొన్ని ప్రాంతాలు 12 నుంచి 15 అడుగుల లోతు నీళ్లల్లో మునిగిపోయాయి. 4.7 లక్షల మంది శహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. 1.5 హెక్టేర్ల భూముల్లోని పంట పొలాలు, లక్షలాది ఇళ్లు నాశనం అయిపోయాయి. బిహార్, అస్సాం, గుజరాత్ లోనూ బీభత్సమే జరిగింది. ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగి పడడంవల్ల, కుంభవృష్టి వల్ల తీవ్ర నష్టం ఎదురైంది.

తక్కువ కాలంలో విపరీతమైన వర్షం కురవడం పరిపాటి అయి పోయింది. ఆనకట్టల నిర్వహణ, భూక్షయం కారణంగా వరద ప్రాంతాల పరిస్థితి భయానకంగా మారింది. దేశంలోని అనేక ప్రాంతాలలో ఈ విపత్తు తప్పడం లేదు. ఈ పరిస్థితి వల్లే 2013లో ఉత్తరాఖండ్ లో, 2015లో చెన్నై, 2018లో కేరళలో, 2019లో కర్నాటకలో ఇదే పరిస్థితి ఎదురైంది. 2005లో, 2019లో మహారాష్ట్ర కూడా ఈ విపత్తునే ఎదుర్కోవలసి వచ్చింది.

మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళలో నదులపై అనేక ఆనకట్టలున్నాయి. కానీ ఈ రాష్ట్రాల మధ్య గొడవలు, ఆనకట్టలను నిర్వహించే వారి మధ్య సమన్వయం కొరవడడంవల్ల లేదా అప్పటికప్పుడు తత్తరపాటు నిర్ణయాలు తీసుకున్నందు వల్ల ఆ ప్రాంతాలలో ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిస్తే దిగువన ఉన్న నదులూ పోటెత్తుతున్నాయి.

కృష్ణా నదిపై కర్నాటకలో ఉన్న ఆల్మట్టి ఆనకట్ట నుంచి భారీగా నీరు విడుదల చేసినందువల్ల దిగువ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కానీ సమయానికి నీరు విడుదల చేయకపోవడంవల్ల మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని ఆనకట్టల్లో నీటిని సక్రమంగా నిలవ చేయకపోవడంవల్ల విషాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. పరిస్థితిని ముందుగా ఊహించడంలో విఫలమయ్యారు. కర్నాటక లోని కావేరి నది నీటిని విడుదల చేయడంవల్ల తమిళనాడు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఆనకట్టల నుంచి హఠాత్తుగా నీటిని విడుదల చేయడంవల్ల ప్రజలు దిక్కు తోచని పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది. సహజంగా వచ్చే వరదలకైతే ప్రజలు అలవాటు పడి ఉంటారు. చాలా చోట్ల వరదలను నివారించడానికి పథకాలు నిర్మించారు. కరకట్టలు కట్టారు. వరదలవల్ల ప్రతి ఏటా 36 లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు. 2008-2018 మధ్య ఇదే పరిస్థి తప్పలేదు. వర్షా కాలంలో వరదల వల్ల ఎక్కువ మంది నష్టపోతున్నారు.

భూ వినియోగంలో మౌలిక మార్పులు, అటవీ ప్రాంతాలను ఇతర ప్రయోజనాలకు వినియోగించుకోవడంవల్ల పర్వత ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. మురుగు నీటి పారుదల సదుపాయం సవ్యంగా లేనదువల్ల కొండ చరియలు విరిగి పడడం, హఠాత్తుగా వరదలొచ్చే ప్రమాదం పశ్చిమ కనుమల్లో, హిమాలయాల సరసన ఉన్న రాష్ట్రాల్లో ఎదురవుతోంది. భూ వినియోగంలో క్రమ పద్ధతి లేనందువల్ల పట్టణ ప్రాంతాలూ జలమయమవుతున్నాయి.

ముంబై మహానగరంలోని వసై-విరార్ లో వరదల కారణంగా 2018లో విపత్కర పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే కొళాపూర్ వెళ్తున్న మహా లక్ష్మి ఎక్స్ ప్రెస్ రైలు నుంచి వెయ్యి మందిని రక్షించవలసి వచ్చింది. మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ఠానే జిల్లాలోని ఉళాస్ నది వరదల బారిన నిలిచిపోయింది. పరిసర ప్రాంతాలలో అడ్డదిడ్డమైన నిర్మాణాలు ఈ దుస్థితికి దారి తీశాయి. నదులకు వరద వచ్చినప్పుడు వాటిల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు నగరాలను ముంచెత్తుతున్నాయి. కేరళలోని పాలక్కడ్ లో ఇదే జరిగింది.

నదులకు అడ్డంగా భవనాలు నిర్మించడం, స్థిరాస్తి వ్యాపారుల ప్రభావం వల్ల నదీ జలాలు పల్లపు ప్రాంతాలను ముచెత్తుతున్నాయి. కోచ్చి, చెన్నై, ముంబై, ఇటీవల నవీ ముంబైలో నదీ జలాలు పారే ప్రాంతాలను లక్ష్య పెట్టకుండా ప్రభుత్వ అధీనంలోనే విమానాశ్రయాలు నిర్మిస్తున్నారు.

వరద ప్రాంతాలకు ఆటంకం కలగడం, కుంటలు, చెరువులు, మడ అడవులు, మాగాణి ప్రాంతాలు, నదీ గర్ఘాలు పూడుకుపోవడంవల్ల సహజంగా నీరింకే సదుపాయం లేకుండా పోతోంది. దీనివల్ల వర్ష ప్రభావం విపరీతమవుతోంది. భూమి మరిత క్రమ క్షయానికి గురవుతోంది. వరద తీసిన తరవాత అనావృష్టి అనివార్యమవుతోంది.

అభివృద్ధి పేరిట నదులను, నేలను లక్ష్య పెట్టకపోవడం ప్రకృతి వైపరీత్యాలకు దారి తీస్తోంది. ఈ పరిణామాలను యథాలాపంగానే చూస్తున్నారు. బాధితులకు సహాయం అందించడంలో కూడా మరింత మానవీయ దృష్టితో వ్యవహరించవలసిన అవసరం ఉంది. కొన్ని వర్గాల వారికే సహాయం అందించడం, వరదొచ్చిన ప్రాంతాలకు రాజకీయ నాయకులు జాతర సాగడం పెరిగిపోతోంది.

కొళాపూర్ లో వరద పీడితుల మీద 144వ సెక్షన్ అమలు చేయడం మరీ దారుణం. ఒక వేపున వరద మట్టం పెరిగిపోతుండగా ప్రజలు నిశ్చేష్టంగా సహాయం కోసం ఎదురు చేడవలసి వచ్చింది. సాంగ్లీలో వరద బాధితులను ఆదుకోవడానికి వినియోగించిన పడవనే బ్రాహ్మనల్ గ్రామలో ఆదుకోవలసి వచ్చింది. ఈ పడవలో ఎక్కువ మంది జనం ఎక్కడంతో మునిగిపోయి 17 మంది మరణించారు.

ఈ దుర్భర పరిస్థితులకు శీతోష్ణ స్థితిలో మార్పులు కారణం కాదని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అంటున్నారు. ఇతర నాయకులు పాత సాకులు చెప్పడంతో సరిపుచ్చుకున్నారు. శీతొష్ణ స్థితిలో మార్పులవల్ల విపత్తులు త్వరితగతిన, భయానకంగా కమ్ముకొస్తున్నాయి. సంబంధిత ప్రభుత్వ వ్యవస్థలు దీర్ఘ నిద్రలోనే ఉండిపోతున్నాయి.

నదుల హరివాణ స్థాయిలో సక్రమమైన ప్రణాళికలు, పరీవాహక ప్రాంతాల పరిరక్షణ, మురిగినీటి పారుదల వ్యవస్థల సక్రమ నిర్వణ అనివార్యమని గుర్తించ్డం లేదు. నదీ గమనాన్ని సహజంగా ఉండకుండా చేస్తే వరదల ముప్పుకు మనమే కారణం అవుతాం.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  7 Sep 2019 7:02 PM GMT
Next Story