Telugu Global
National

14 రోజుల్లో విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు

చంద్రుడికి అతి సమీపంగా వెళ్లినా…. సాంకేతిక కారణాలతో చంద్రుడ్ని చేరుకోలేక పోయిన చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ తో తిరిగి సాంకేతిక సంబంధాలను కొనసాగిస్తామని ఇస్రో చైర్మన్ కే.శివన్ తెలిపారు. “విక్రమ్ ల్యాండర్ తో సాంకేతిక సంబంధాలను పునరుద్ధరించేందుకు మరో 14 రోజుల సమయం పడుతుంది. విక్రమ్ ల్యాండర్ తో సాంకేతికంగా అనుసంధానం అయ్యేందుకు మా శాయశక్తులా కృషి చేస్తాం” అని ఇస్రో చెర్మన్ శివన్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. చంద్రుడికి అతి సమీపంగా […]

14 రోజుల్లో విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు
X

చంద్రుడికి అతి సమీపంగా వెళ్లినా…. సాంకేతిక కారణాలతో చంద్రుడ్ని చేరుకోలేక పోయిన చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ తో తిరిగి సాంకేతిక సంబంధాలను కొనసాగిస్తామని ఇస్రో చైర్మన్ కే.శివన్ తెలిపారు.

“విక్రమ్ ల్యాండర్ తో సాంకేతిక సంబంధాలను పునరుద్ధరించేందుకు మరో 14 రోజుల సమయం పడుతుంది. విక్రమ్ ల్యాండర్ తో సాంకేతికంగా అనుసంధానం అయ్యేందుకు మా శాయశక్తులా కృషి చేస్తాం” అని ఇస్రో చెర్మన్ శివన్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

చంద్రుడికి అతి సమీపంగా 2.1 కిలోమీటర్ల వద్ద చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ ఇస్రో గ్రౌండ్ ప్రధాన కార్యాలయంతో సాంకేతిక సంబంధాలను కోల్పోయింది. ఈ ప్రయోగం విఫలమైనా దేశ ప్రజలందరూ ఇస్రో వెనకే ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీతో సహా దేశం మొత్తం ప్రకటించింది.

ఇంతటి ప్రయోగం విఫలమైనా “ముందుకు వెళ్ళండి” అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధైర్య వచనాలు పలకడంతో పాటు సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు సంబంధించిన అతిరథ మహారథులందరూ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించి “మీ వెంట మేమున్నాము”అంటూ ప్రకటించారు.

ప్రయోగం విఫలమైన అనంతరం కన్నీటిపర్యంతమైన ఇస్రో చైర్మన్ శివన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలింగనం చేసుకుని ఓదార్చడం విశేషం. ఈ పరిణామాల అనంతరం తొలిసారిగా ఓ ఛానెల్ తో మాట్లాడిన ఇస్రో చైర్మన్ శివన్ విక్రమ్ ల్యాండర్ తో సాంకేతిక సంబంధాలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు.

“చంద్రునిపై కాలు మోపే చివరి క్షణంలో మేము సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. ఒకింత జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే చంద్రయాన్-2 ప్రయోగం విజయం సాధించేది” అని ఆయన అన్నారు.

చంద్రునికి అతి సమీపంలో 2.1 కిలోమీటర్ల వద్ద తాము సాంకేతిక అనుసంధానాన్ని కోల్పోయామనీ, దీనిని తిరిగి పునరుద్ధరించేందుకు మరో 14 రోజుల సమయం పడుతుందని ఇస్రో చెర్మన్ శివన్ ప్రకటించారు. చంద్రయాన్-2ను ప్రయోగించే సమయం లోనూ, సఫలీకృతం కాలేని సమయంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలికిన ధైర్య వచనాలు మా శాస్త్రవేత్తల్లో ఆత్మస్థైర్యం కలిగించాయని, దేశ ప్రజలందరూ తమ వెంటే ఉన్నారనే ధైర్యం శాస్త్రవేత్తల్లో వచ్చిందని ఇస్రో చైర్మన్ తెలిపారు. “ఆనందం, ఉద్విగ్న క్షణాలలోనే కాదు విషాదకర సంఘటనల సమయంలో కూడా దేశ ప్రజలు మా వెంట ఉన్నారనే భావన మేం మరింత కృషి చేయడానికి దోహదపడుతుంది” అని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు.

First Published:  7 Sep 2019 9:15 PM GMT
Next Story