ఏసెయ్ రా నా కొడుకుని…. వర్మ సంచలన పోస్ట్

వివాదాలు లేనిదే పొద్దుపోని రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశాడు. ఇప్పటికే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ లాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టించే సినిమాను తీస్తున్నాడు వర్మ. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆ సినిమాలోని పాత్రలను రివీల్ చేస్తున్నాడు. చంద్రబాబును పోలిన పాత్రధారి ఫొటో, పవన్ కళ్యాణ్ పాత్రధారి ఫొటోలను విడుదల చేసి సంచలనం రేపారు.

తాజాగా కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సంబంధించి మరో యూట్యూబ్ వీడియోను రాంగోపాల్ వర్మ రిలీజ్ చేశారు. ‘ఏసెయ్ రా నా కొడుకుని’ అనే డైలాగ్ వస్తుండగా.. కమ్మరాజ్యంలో టైటిల్ సాంగ్ ప్లే అయ్యింది.

అంతేకాదు ఈ పోస్టుకు ఆసక్తి రేపేలా క్యాప్షన్ ఇచ్చి వర్మ తన నిగూఢ అర్థాన్ని చెప్పకనే చెప్పాడు. రక్త చరిత్రకు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు పెళ్లి చేస్తే పుట్టే పిల్లలే కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ ట్యాగ్ చేశారు. దీంతో ఇది పెద్ద వివాదాస్పదం అవుతోంది..

దీన్ని బట్టి వైసీపీ వచ్చాక రాష్ట్రంలో కమ్మల పరిస్థితి… దోచుకున్నదంతా జగన్ సర్కారు కక్కిస్తుందన్న అర్థం వచ్చేలానే రాంగోపాల్ వర్మ తన సినిమాలో చూపించబోతున్నట్టు అర్థమవుతోందంటున్నారు.

మొత్తానికైతే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బాగా వంటపట్టించుకున్న వర్మ ప్రతిపక్ష చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే ఈసినిమాను రూపొందించారని.. విడుదలతో పెద్ద దుమారమే రేపడం ఖాయమన్న అంచనాలు నెలకొన్నాయి.

పోస్టు ఇదే..