Telugu Global
NEWS

కేసీఆర్ కేబినెట్ : ఫస్ట్ హరీష్.. సెకండ్ కేటీఆర్.. లాస్ట్ పువ్వాడ

కేసీఆర్ కొత్త కేబినెట్ కొలువుదీరింది. ఆదివారం సాయంత్రం రాజభవన్ లో నూతన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈసందర్భంగా హరీష్ రావు, కేటీఆర్, సబితా, గంగుల, సత్యవతి, పువ్వాడలు మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా కేబినెట్ ప్రమాణ స్వీకారంలో మొదట హరీష్ రావు ప్రమాణం చేశారు. ఇక రెండో ప్రమాణం కేటీఆర్ చేశారు. ఆ తర్వాత సబిత, గంగుల , సత్యవతి, పువ్వాడలు ప్రమాణం చేశారు.. ఇక మంత్రివర్గ ప్రమాణ […]

కేసీఆర్ కేబినెట్ : ఫస్ట్ హరీష్.. సెకండ్ కేటీఆర్.. లాస్ట్ పువ్వాడ
X

కేసీఆర్ కొత్త కేబినెట్ కొలువుదీరింది. ఆదివారం సాయంత్రం రాజభవన్ లో నూతన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈసందర్భంగా హరీష్ రావు, కేటీఆర్, సబితా, గంగుల, సత్యవతి, పువ్వాడలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

కాగా కేబినెట్ ప్రమాణ స్వీకారంలో మొదట హరీష్ రావు ప్రమాణం చేశారు. ఇక రెండో ప్రమాణం కేటీఆర్ చేశారు. ఆ తర్వాత సబిత, గంగుల , సత్యవతి, పువ్వాడలు ప్రమాణం చేశారు..

ఇక మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి హరీష్ రావు, కేటీఆర్ లు ఇద్దరూ ఒకే కారులో రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చొని నాయకులను పలకరించడం.. అభివాదాలు చేయడం చూసి టీఆర్ఎస్ శ్రేణులను జోష్ లో నింపింది.

కేసీఆర్ తాజా కేబినెట్ విస్తరణలో వెలమలు ఇద్దరు హరీష్ రావు, కేటీఆర్… కమ్మ ఒకరు పువ్వాడ… రెడ్డి సామాజికవర్గం నుంచి సబిత…. బీసీ కాపు గంగుల కమలాకర్…. ఎస్టీ కోటాలో సత్యవతి రాథోడ్ లకు అవకాశం ఇచ్చారు. కేటీఆర్, హరీష్ ల చేరికతో ఎర్రబెల్లితో కలిసి వెలమల సంఖ్య నాలుగుకు చేరింది. సబిత చేరికతో రెడ్ల సంఖ్య ఆరుకు చేరింది.

First Published:  8 Sep 2019 8:05 AM GMT
Next Story