బన్నీ చిత్ర బృందానికి చుక్కలు చూపిస్తున్న పూజ హెగ్డే

‘డిజె’ సినిమా తో హాట్ బ్యూటీ పూజ హెగ్డే రేంజ్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమాలో తన అందాన్ని ఆరబోసిన ఈమె వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలు పెట్టింది. ఈ మధ్యనే ‘మహర్షి’ సినిమాలో మహేష్ బాబు తో రొమాన్స్ చేసిన ఈమె ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘వాల్మీకి’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రేక్షకుల తెరకెక్కనున్న ‘అల వైకుంటపురంలో’ సినిమాలో కూడా పూజా హెగ్డే బన్నీతో రొమాన్స్ చేస్తోంది.

అయితే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ భామ సమయపాలన మాత్రం అస్సలు ఫాలో అవ్వడం లేదని సమాచారం. ఈ మధ్య తరచుగా పూజ హెగ్డే షూటింగ్ సెట్స్ కి ఆలస్యంగా వెళుతుందట. అంతేకాక మధ్యాహ్నం భోజన సమయానికి కూడా బయటకు వెళ్లి షూటింగ్ కి మళ్ళీ చాలా ఆలస్యంగా వస్తుందని, ఈమె వల్ల షూటింగ్ కూడా ఆలస్యం అవుతుందని సమాచారం.

ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారు…. కానీ పూజా హెగ్డే వల్ల సినిమా విడుదల కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా పూజా హెగ్డే గనుక తన వైఖరి మార్చుకోకపోతే తన కెరీర్ పై ప్రభావం పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.