Telugu Global
National

రామ్‌జెఠ్మలానీ కన్నుమూత

ప్రముఖ లాయర్, మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రాంజెఠ్మలానీ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. జెఠ్మలానీ వయసు 95 ఏళ్లు. వయసు మీద పడడంతో ఆయన ఇబ్బందిపడుతున్నారు. వాజ్‌పేయి హయాంలో న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. దేశంలోనే ప్రముఖ న్యాయవాదిగా ఆయనకు పేరుంది. అంతే కాదు ఆయన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గానూ పని చేశారు. దేశంలో అనేక కీలకమైన కేసులను వాదించిన రాంజెఠల్మానీ సుప్రీంకోర్టులో అత్యంత ఎక్కువ ఫీజు తీసుకునే న్యాయవాదిగా […]

రామ్‌జెఠ్మలానీ కన్నుమూత
X

ప్రముఖ లాయర్, మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రాంజెఠ్మలానీ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. జెఠ్మలానీ వయసు 95 ఏళ్లు. వయసు మీద పడడంతో ఆయన ఇబ్బందిపడుతున్నారు. వాజ్‌పేయి హయాంలో న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

దేశంలోనే ప్రముఖ న్యాయవాదిగా ఆయనకు పేరుంది. అంతే కాదు ఆయన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గానూ పని చేశారు. దేశంలో అనేక కీలకమైన కేసులను వాదించిన రాంజెఠల్మానీ సుప్రీంకోర్టులో అత్యంత ఎక్కువ ఫీజు తీసుకునే న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు.

1923లో సెప్టెంబర్ 14న ముంబైలో జెఠ్మలానీ జన్మించారు. రాంజెఠల్మానీకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన సంతానంలో మహేష్ జెఠల్మానీ, రాణి జెఠల్మానీ కూడా న్యాయవాదులుగానే ఉన్నారు.

స్కూల్‌ డేస్‌లో డబుల్ ప్రమోషన్‌తో 13 ఏళ్లకే మెట్రికూలేషన్ పూర్తి చేసిన రామ్‌ జెఠ్మలానీ 17 ఏళ్లకే ఎల్‌ఎల్‌బీ తీసుకున్నారు. ప్రత్యేక అనుమతి ద్వారా 18 ఏళ్లకే న్యాయవాదిగా పనిచేసేందుకు అప్పట్లో తనకు అనుమతి ఇచ్చారని ఒక ఇంటర్వ్యూలో రామ్‌జెఠ్మలానీ చెప్పారు. రాంజెఠల్మానీ 2017 సెప్టెంబర్ 10 న తను న్యాయవాద వృత్తి నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు.

రాంజెఠ్మలానీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

First Published:  7 Sep 2019 10:37 PM GMT
Next Story