3 మిలియన్ మార్క్ చేరుకున్న సాహో

ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజే మిలియన్ మార్క్ క్లబ్ లోకి చేరిన సాహోకు, 2 మిలియన్ క్లబ్ లోకి చేరడానికి 4 రోజులు పడితే.. తాజాగా ఇప్పుడు 3 మిలియన్ క్లబ్ లోకి చేరడానికి ఏకంగా 9 రోజులు పట్టింది. ఎట్టకేలకు 3 మిలియన్ క్లబ్ లో చేరిన ఈ సినిమా ఓవర్సీస్ లో మందకొడిగా సాగుతోంది. పెరిగిన టిక్కెట్ రేట్లు తగ్గించినప్పటికీ, ఆన్ లైన్లో ఆఫర్లు ప్రకటించినప్పటికీ సాహో కోసం వెళ్లేందుకు ఓవర్సీస్ ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

ప్రస్తుతానికి లిస్ట్ లో సాహో కంటే ముందు బాహుబలి-2, బాహుబలి, రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలున్నాయి. వీటిలో రంగస్థలం, భరత్ అనే నేను సినిమాల వసూళ్లను సాహో క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. బాహుబలి-2, బాహుబలి-2 రికార్డుల్ని అధిగమించేంత సీన్ మాత్రం ఈ సినిమాకు లేదని తేలిపోయింది.

అయితే భరత్ అనే నేను కంటే తక్కువగానే ఈ సినిమాకు వసూళ్లు వస్తాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. మహా అయితే మరో 20వేల డాలర్లు మాత్రమే వస్తాయని, అంతకుమించి సాహో పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ లేదంటోంది ట్రేడ్.

ఓవర్సీస్ లో భారీ వసూళ్లు సాధించిన చిత్రాలు
బాహుబలి 2 – 12 మిలియన్ డాలర్లు
బాహుబలి 1 – 6.9 మిలియన్ డాలర్లు
రంగస్థలం – 3.5 మిలియన్ డాలర్లు
భరత్ అనే నేను – 3.4 మిలియన్ డాలర్లు
సాహో – 3 మిలియన్ డాలర్లు