‘సాహో’… సుజిత్ ముందే చెప్పాడట!

భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ ను అందుకుంటోంది.

అయితే సాహో కి ఇలాంటి రెస్పాన్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని తెలిసి తెలిసి చేసినవి కావడం గమనార్హం. చివర్లో దర్శకుడు సుజిత్ కి… నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడం సినిమాకి మైనస్ గా మారింది. సినిమా నిడివి విషయంలో సుజిత్  అభ్యంతరం చెప్పాడట… కానీ యు.వి.క్రియేషన్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ తో ఉందట.

పాటల విషయంలో కూడా సుజిత్ తన అభిప్రాయాలని చెప్పాడట. హిందీ వెర్షన్ లో మాత్రమే పాటలు ఉంచి తెలుగులో తీసేద్దామని సుజిత్ ప్లాన్. కానీ యు.వి.క్రియేషన్స్ వారు దానికి ఒప్పుకోలేదు. పాటలు లేకపోతే ప్రభాస్ అభిమానులు నిరాశ పడతారని యూవీ వారి వాదన. రాసుకున్న ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించి ఆ తరువాత దీన్ని వాడాలా? వద్దా? అని ఆలోచించటం వల్ల డబ్బు, సమయం రెండూ వృధా అయిపోతాయని యు.వి.క్రియేషన్స్ వారు భావించారట.

ఈ విషయంలో సుజిత్ తప్పు ఎంత ఉందో యు.వి.క్రియేషన్స్ వారిది కూడా అంతే ఉందని అంటున్నారు మేకర్స్. కానీ ‘సాహో’ ఫెయిల్యూర్ కి  అందరూ సుజిత్ వైపే చూస్తున్నారు.