స్టేజ్ ఎక్కే ముందు ప్రిపరేషన్ ఇలా…

గత కొన్నేళ్లుగా టీవీ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది సుమ కనకాల. యాంకర్ అన్న మాట వినగానే ముందుగా గుర్తొచ్చే పేరు సుమ. ఒకవైపు టీవీ షో లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లతో బిజీగా ఉన్న సుమా మరోవైపు ‘సుమక్క’ అనే పేరుతో యూట్యూబ్ చానల్ ని స్టార్ట్ చేసింది. ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయకముందే ఈమెకి 30 వేల దాకా సబ్ స్క్రేబర్లు వచ్చేశారు. అది సుమ కున్న క్రేజ్.

సుమ తాజాగా ఒక వీడియోని యూట్యూబ్ లో షేర్ చేసింది. ఆ వీడియోలో మొదట మేకప్ వేసుకుని రెడీ అయిన సుమ స్టూడియోకి వెళుతుంది.

ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చిన ఈమె ‘పహిల్వాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించింది. దీనికి సంబంధించిన కొన్ని ఫుటేజీలను కూడా సుమ తన వ్లాగ్ లో షేర్ చేసుకుంది.

అయితే బ్యాక్ స్టేజ్ వీడియో లో మాట్లాడుతూ ఆమె తన గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. ఇప్పటికీ కూడా సుమ స్టేజ్ ఎక్కేముందు ప్రిపేర్ అయ్యి వెళుతుందట. అదే తన సీక్రెట్ అని చెప్పుకొచ్చింది సుమ. టీవీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న సుమ…. ఇప్పుడు యూట్యూబ్ లో ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.