Telugu Global
NEWS

యూఎస్ నయా క్వీన్ బియాంకా

ఫైనల్లో సెరెనా టైటిల్ ఆశలు ఆవిరి విజేత బియాంకాకు 27 కోట్ల 40 లక్షలు అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సరికొత్త చాంపియన్ గా కెనేడియన్ థండర్ బియాంకా యాండ్రెస్కూ నెగ్గి సరికొత్త విజేతగా అవతరించింది. గ్రాండ్ రికార్డు విజయంతో మార్గారెట్ కోర్టు సరసన నిలవాలన్న అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ ఆశలను అడియాసలు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద టెన్నిస్ వేదికగా న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టు వేదికగా ముగిసిన టైటిల్ సమరంలో […]

యూఎస్ నయా క్వీన్ బియాంకా
X
  • ఫైనల్లో సెరెనా టైటిల్ ఆశలు ఆవిరి
  • విజేత బియాంకాకు 27 కోట్ల 40 లక్షలు

అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సరికొత్త చాంపియన్ గా కెనేడియన్ థండర్ బియాంకా యాండ్రెస్కూ నెగ్గి సరికొత్త విజేతగా అవతరించింది. గ్రాండ్ రికార్డు విజయంతో మార్గారెట్ కోర్టు సరసన నిలవాలన్న అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ ఆశలను అడియాసలు చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద టెన్నిస్ వేదికగా న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టు వేదికగా ముగిసిన టైటిల్ సమరంలో 18 ఏళ్ల బియాంకా వరుస సెట్లలో 6-3, 7-5తో మాజీ చాంపియన్ సెరెనాను కంగు తినిపించి…తన కెరియర్ లో తొలి గ్రాండ్ స్లామ్ ట్రోఫీని అందుకొంది. ఈ ఘనత సాధించిన కెనడా తొలిమహిళగా రికార్డుల్లో చేరింది.

23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత సెరెనాకు తల్లిహోదాలో ఇది నాలుగో గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఓటమి కావడం విశేషం. గత ఏడాది యూఎస్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ నవోమీ ఒసాకా చేతిలో పరాజయం పొందిన సెరెనా ..ఈ ఏడాది ఫైనల్లో బియాంకా చేతిలో ఓటమి పొందక తప్పలేదు.

తన కెరియర్ లో 33వసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడిన సెరెనాకు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.

విజేతగా నిలిచిన బియాంకాకు ట్రోఫీతో పాటు 27 కోట్ల 40 లక్షల రూపాయలు, రన్నరప్ సెరెనాకు 13కోట్ల 20 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా దక్కింది.

గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ చరిత్రలో అత్యధికంగా 24 టైటిల్స్ నెగ్గిన మార్గారెట్ కోర్టు సరసన నిలవాలన్న23 టైటిల్స్ విన్నర్ సెరెనా.. మరికొంతకాలం వేచిచూడక తప్పదు.

First Published:  7 Sep 2019 9:03 PM GMT
Next Story