యూఎస్ ఓపెన్లో నేడే టైటిల్ సమరం

  • ఫైనల్లో నడాల్ తో మెద్వదేవ్ ఢీ
  • 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు రఫా తహతహ

అమెరికన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు న్యూయార్క్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. సూపర్ సండే టైటిల్ సమరంలో ప్రపంచ రెండోర్యాంక్ ఆటగాడు, రెండోసీడ్ రాఫెల్ నడాల్ తో రష్యా ఆటగాడు డానెల్లీ మెద్వదేవ్ ఢీ కొనబోతున్నాడు.

ఆర్థర్ యాష్‌ స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో జరిగే టైటిల్ సమరంలో నడాల్ హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతున్నాడు. ఇప్పటికే 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన నడాల్ 19వ టైటిల్ కు గురిపెట్టాడు.

తొలి సెమీఫైనల్లో నడాల్ 7-6, 6-4, 6-1తో ఇటలీ ఆటగాడు మాటియో బెర్టినీని ఆధిగమించాడు.

ఫైనల్లో రష్యా ఆటగాడు, 5వ సీడ్ డానిల్ మెద్వదేవ్ తో నడాల్ తలపడతాడు.

డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్, గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్ర్రమించడంతో…నడాల్ టైటిల్ నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.

2010, 2013, 2017 సంవత్సరాలలో యూఎస్ టైటిల్ నెగ్గిన రాఫెల్ నడాల్…నాలుగోసారి విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో ఫెదరర్ అత్యధికంగా 20 టైటిల్స్ నెగ్గితే…33 ఏళ్ల నడాల్ 18 టైటిల్స్ తో ఫెదరర్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

ప్రస్తుత టైటిల్ నెగ్గితే నడాల్ 19 టైటిల్స్ తో ఫెదరర్ తర్వాతి స్థానంలో నిలువగలుగుతాడు.