Telugu Global
National

విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించిన ఇస్రో

చంద్రుని సమీపానికి వెళ్లి కమ్యూనికేషన్‌ కోల్పోయిన విక్రమ్ ల్యాండర్ గురించి కీలకమైన సమాచారాన్ని ఇస్రో సాధించింది. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దగ్గర వరకు సురక్షితంగా వెళ్లిన విక్రమ్ ల్యాండర్ ఆ తర్వాత సంబంధాలను కోల్పోయింది. దాంతో ఒక్కసారి అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. ఈనేపథ్యంలో అసలు విక్రమ్‌ ల్యాండర్‌కు ఏమైంది?. క్రాష్ ల్యాండ్ అయిందా?. దాని పరిస్థితి ఎలా ఉంది? అన్న దానిపై ఇస్రో శాస్త్రవేత్తలు తర్జనభర్జన పడ్డారు. అయితే ఎట్టకేలకు విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకిని ఇస్రో గుర్తించింది. […]

విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించిన ఇస్రో
X

చంద్రుని సమీపానికి వెళ్లి కమ్యూనికేషన్‌ కోల్పోయిన విక్రమ్ ల్యాండర్ గురించి కీలకమైన సమాచారాన్ని ఇస్రో సాధించింది. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దగ్గర వరకు సురక్షితంగా వెళ్లిన విక్రమ్ ల్యాండర్ ఆ తర్వాత సంబంధాలను కోల్పోయింది. దాంతో ఒక్కసారి అందరూ నిరుత్సాహానికి గురయ్యారు.

ఈనేపథ్యంలో అసలు విక్రమ్‌ ల్యాండర్‌కు ఏమైంది?. క్రాష్ ల్యాండ్ అయిందా?. దాని పరిస్థితి ఎలా ఉంది? అన్న దానిపై ఇస్రో శాస్త్రవేత్తలు తర్జనభర్జన పడ్డారు. అయితే ఎట్టకేలకు విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకిని ఇస్రో గుర్తించింది. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ ఉన్న చోటును గుర్తించినట్టు ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు.

కక్షలో తిరుగుతున్న ఆర్బిటర్‌…. ల్యాండర్‌ లోకేషన్‌ను గుర్తించడంలో సాయపడింది. ల్యాండర్‌ను గుర్తించినప్పటికీ దానితో ఇప్పటికీ ఎలాంటి కమ్యూనికేషన్ సాధించలేకపోతున్నామని శివన్ వెల్లడించారు. త్వరలోనే విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ల్యాండర్‌ థర్మల్ ఇమేజ్‌ను ఆర్బిటర్‌ క్లిక్ చేసిందని వివరించారు.

First Published:  8 Sep 2019 4:48 AM GMT
Next Story