Telugu Global
NEWS

టెస్ట్ క్రికెట్లో పసికూన అప్ఘన్ సంచలనం

బంగ్లాదేశ్ పై 224 పరుగుల విజయం మూడుటెస్టుల్లో రెండు విజయాల అఫ్ఘనిస్థాన్ సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో పసికూన అప్ఘనిస్థాన్ సంచలన విజయం సాధించింది. గత ఏడాదే టెస్ట్ హోదా పొందిన అఫ్ఘన్ జట్టు తాను ఆడిన మూడుటెస్టుల్లోనే రెండో విజయం సాధించడం ద్వారా వారేవ్వా అనిపించుకొంది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా..బంగ్లాదేశ్ తో చిట్టగాంగ్ వేదికగా ముగిసిన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఐదురోజుల ఆటలోనూ రషీద్ ఖాన్ నాయకత్వంలోని అఫ్ఘన్ జట్టు సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది. 398 […]

టెస్ట్ క్రికెట్లో పసికూన అప్ఘన్ సంచలనం
X
  • బంగ్లాదేశ్ పై 224 పరుగుల విజయం
  • మూడుటెస్టుల్లో రెండు విజయాల అఫ్ఘనిస్థాన్

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో పసికూన అప్ఘనిస్థాన్ సంచలన విజయం సాధించింది. గత ఏడాదే టెస్ట్ హోదా పొందిన అఫ్ఘన్ జట్టు తాను ఆడిన మూడుటెస్టుల్లోనే రెండో విజయం సాధించడం ద్వారా వారేవ్వా అనిపించుకొంది.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా..బంగ్లాదేశ్ తో చిట్టగాంగ్ వేదికగా ముగిసిన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఐదురోజుల ఆటలోనూ రషీద్ ఖాన్ నాయకత్వంలోని అఫ్ఘన్ జట్టు సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది.

398 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ను ఆఖరిరోజు ఆటలో కేవలం 173 పరుగుల స్కోరుకే అప్ఘన్ బౌలర్లు కుప్పకూల్చగలిగారు.

వర్షంతో రెండు సెషన్లపాటు ఆట నిలిచిపోయినా…ఆఖరి సెషన్ విరామంలోనే అఫ్ఘన్ జట్టు సంచలన విజయం పూర్తి చేసింది.

హాఫ్ సెంచరీతో పాటు 11 వికెట్లు పడగొట్టిన అప్ఘన్ కెప్టెన్ కమ్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

బెంగళూరు వేదికగా భారత్ తో టెస్ట్ అరంగేట్రం చేసిన అప్ఘన్ జట్టు తొలిటెస్టులో ఓటమి పొందినా …తన రెండోటెస్ట్ మ్యాచ్ లో ఐర్లాండ్ ను, మూడో మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేయడం ద్వారా తన సత్తా ఏపాటిదో చాటుకోగలిగింది.

First Published:  9 Sep 2019 6:15 AM GMT
Next Story