Telugu Global
CRIME

చీకటి అడవిలో జీపు నుంచి జారిపడిన పసిపాప

కేరళ లో ప్రముఖ టూరిస్ట్ కేంద్రం మున్నార్ ఎప్పుడూ వచ్చే పోయే జనంతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తమిళనాడులోని దేవాలయానికి వెళ్లి వస్తున్నది. మున్నార్ ఘాట్ రోడ్డు గుండా రాత్రి 9:30 ప్రాంతంలో స్వస్థలానికి వెళుతూ ఉంది. అయితే వారు ప్రయాణిస్తున్న జీపు నుంచి ఓ చిన్నారి పాప జీపు కుదుపులకు రోడ్డు మీద పడిపోయింది. అయినా తల్లిదండ్రులు ఆమె పడిపోయిన విషయాన్ని గమనించలేదు. వారు నిద్రలో జోగుతూ ఉండటంవల్ల ఈ […]

చీకటి అడవిలో జీపు నుంచి జారిపడిన పసిపాప
X

కేరళ లో ప్రముఖ టూరిస్ట్ కేంద్రం మున్నార్ ఎప్పుడూ వచ్చే పోయే జనంతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తమిళనాడులోని దేవాలయానికి వెళ్లి వస్తున్నది. మున్నార్ ఘాట్ రోడ్డు గుండా రాత్రి 9:30 ప్రాంతంలో స్వస్థలానికి వెళుతూ ఉంది.

అయితే వారు ప్రయాణిస్తున్న జీపు నుంచి ఓ చిన్నారి పాప జీపు కుదుపులకు రోడ్డు మీద పడిపోయింది. అయినా తల్లిదండ్రులు ఆమె పడిపోయిన విషయాన్ని గమనించలేదు. వారు నిద్రలో జోగుతూ ఉండటంవల్ల ఈ సంఘటన జరిగింది.

అయితే కిందపడిన ఏడాది వయసున్న ఈ పాప రోడ్డుపై ఆ చీకట్లో పాకులాడుతూ కనిపించింది. చెక్ పోస్ట్ సమీపంలో ఇది జరగటం వల్ల అక్కడే ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ చీకట్లో నడిరోడ్డుపై పాకుతున్న ఆ పాప ని చూసి పోలీసులకు ఫోన్ చేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు అక్కడికి సమీపంలోనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

“రాత్రి తొమ్మిది గంటల 40 నిమిషాలకు నాకు ఈ భయంకరమైన ఫోన్ కాల్ వచ్చింది. 10 గంటలకల్లా ఆ పాప మాతో ఉంది. ఆమెకు వైద్య సహాయం చేశాం. అన్ని పోలీస్ స్టేషన్ల కు సమాచారం అందించాం. 11 గంటల సమయంలో మాకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్ లో పాప మిస్ అయిందని ఒక కేసు ఫైల్ అయినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మేము ఆ పాప తల్లిదండ్రులను పిలిపించి భద్రంగా పాపను వారికి అందజేశాం” అన్నారు మున్నార్ సబ్ ఇన్స్ పెక్టర్ సంతోష్.

సీసీటీవీ ఫుటేజీని చూసినప్పుడు జీపు లో నుంచి పడిపోయిన పాప కొన్ని సెకన్లలోనే రోడ్డుపై పాకుతున్నట్టు కనిపించింది. ఆ చీకటి నిర్మానుష్య అడవిలో తల్లి ఒడిలో వెచ్చగా నిద్రిస్తున్న ఆ చిట్టి తల్లి ఒక్కసారిగా రోడ్డుపై పడటంతో తలకు గాయమైంది. ప్రమాదమేమీ లేదు కానీ… ఈ హఠాత్పరిణామానికి ఆ పసి గుండె ఎంతగా క్షోభించి ఉంటుందో కదా…!

First Published:  9 Sep 2019 6:42 AM GMT
Next Story