దేవ కట్టాతో తేజ్…. స్టోరీ లైన్ ఇదేనా?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వం లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుంది అనే విషయం లో ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

కానీ ఈ లోపే సాయి ధరమ్ తేజ్ ఒక కొత్త ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టాడు. దేవ కట్టా దర్శకత్వం లో ఒక ఆసక్తికరమైన కథలో నటించబోతున్నాడట సాయి ధరమ్ తేజ్.

ఈ సినిమా ఒక సోషల్ డ్రామా లాగా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా లో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కుగా ఉండబోతున్నాయట. అంతే కాకుండా ఎవరైతే పోరాటంలో ముందుంటారో… వాళ్ళకి కష్టాలు తప్పవు అనే లైన్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం.

అదేవిధంగా ఈ సినిమా లో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు, అవినీతి పై పోరాటం…. ఇలా పలు అంశాల పై కథ ఉండనుందని సమాచారం. అయితే పూర్తి వివరాలు మాత్రం త్వరలో వెలువడనున్నాయి.