సాహో…. దేవి శ్రీ పాటని కట్ చేశారట…

భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో సినిమా టాక్ పరంగా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలలో ఒకటి సంగీతం అని కొందరు అంటున్నారు. ముందుగా ఈ సినిమాకి శంకర్-ఎహ్సాన్-లోయ్ ని సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

దీంతో దర్శక నిర్మాతలు ఒక్కో పాటని ఒక్కో సంగీత దర్శకుడితో కంపోజ్ చేయించారు. కానీ ఈ పాటలు సినిమాకి ఏ మాత్రం ప్లస్ అవ్వలేదు. జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం బాగానే ఉంది…. కానీ పాటల విషయంలో మాత్రం ‘సాహో’ సినిమా అంచనాలను మించలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక పాట అందించాడట. దాన్ని రికార్డు కూడా చేశారట. కానీ ఆ పాటని ఈ సినిమా నుంచి తీసేసినట్టు సమాచారం.

హీరో ఇంట్రడక్షన్ పాటలు ఇవ్వడంలో దేవి శ్రీ ప్రసాద్ దిట్ట. ‘సాహో’ సినిమాలో కూడా ప్రభాస్ ఎంట్రీ సీన్ తర్వాత దేవి శ్రీ ప్రసాద్ పాట రావాల్సిందట. కానీ దానివల్ల సినిమాకి ఉపయోగం ఉండదనుకున్న దర్శకనిర్మాతలు పాటని తీసేశారట.

ఆ పాట ని పెట్టి ఉంటే సినిమాకి అది ఎంతో కొంత ప్లస్ అయ్యేది అని కొందరి అభిప్రాయం. మరి ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ ఆ పాటని ఏం చేస్తారో? ఎవరికి ఇస్తారో? చూడాలి.