Telugu Global
National

తరగతి గదిలో గొడుగుల కింద...

పలక-బలపాలు, పుస్తకాలు పట్టాల్సిన చేతులు గొడుగులు పట్టి క్లాసు రూముల్లో ఒదిగి ఒదిగి కూర్చొని పాఠాలు వినాల్సిన పరిస్థితిలో ఉన్న ఈ విద్యార్థులను చూస్తే చదువుకోవడానికి వారు పడుతున్న తిప్పలు అర్థమవ్వడమే కాదు… చదువు పట్ల, విద్యార్థుల ప్రాణాలపట్ల అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యం కూడ తెలుస్తుంది. జార్ఖండ్ లోని ఓ పాఠశాలలో పిల్లలు వర్షాకాలంలో తమను, తమ పుస్తకాలను వర్షపు నీరు నుంచి కాపాడుకోవటానికి క్లాసులోనే గొడుగులు పట్టి కూర్చో వలసిన పరిస్థితి ఉంది. ఇది ఒకటి […]

తరగతి గదిలో గొడుగుల కింద...
X

పలక-బలపాలు, పుస్తకాలు పట్టాల్సిన చేతులు గొడుగులు పట్టి క్లాసు రూముల్లో ఒదిగి ఒదిగి కూర్చొని పాఠాలు వినాల్సిన పరిస్థితిలో ఉన్న ఈ విద్యార్థులను చూస్తే చదువుకోవడానికి వారు పడుతున్న తిప్పలు అర్థమవ్వడమే కాదు… చదువు పట్ల, విద్యార్థుల ప్రాణాలపట్ల అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యం కూడ తెలుస్తుంది.

జార్ఖండ్ లోని ఓ పాఠశాలలో పిల్లలు వర్షాకాలంలో తమను, తమ పుస్తకాలను వర్షపు నీరు నుంచి కాపాడుకోవటానికి క్లాసులోనే గొడుగులు పట్టి కూర్చో వలసిన పరిస్థితి ఉంది. ఇది ఒకటి రెండు రోజులు పరిస్థితి కాదు. వర్షాకాలం అంతా ఇట్లాగే చదువుకోవాలి. మురెతకురా అనే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులను అధికారులే గొడుగులు తెచ్చుకోమని బలవంతం చేస్తున్నారట. ఉండటానికి పక్కా బిల్డింగ్ ఉన్నా… వర్షాలకు బిల్డింగ్ రూఫ్ లీక్ అవుతుందట. లీక్ అవుతున్న పైకప్పును బాగు చేయవలసిన అధికారులు చేయకుండా గొడుగులు తెచ్చుకోమని పిల్లలకు సలహాలు ఇస్తున్నారట.

ఆ పాఠశాలలో పనిచేస్తున్న రతి కాంత్ ప్రధాన్ అనే టీచర్ మాట్లాడుతూ… “పాఠశాలకు ఉన్న విద్యుత్ సరఫరాను ముందు జాగ్రత్త చర్యగా ఆపి వేశాం. ప్రభుత్వం మా పాఠశాల సమస్యలను పరిష్కరించాలి” అని కోరాడు.

ఈ పాఠశాలలో 7 క్లాస్ రూములు ఉన్నాయి. ఇందులో మూడు రూములు తప్ప మిగతావన్నీ కురుస్తున్నాయి.

పిల్లలతో మాట్లాడి తే… ఈ వర్షాల వలన మా చదువులు పూర్తిగా దెబ్బతింటున్నాయని అన్నారు. “ఈ వర్షాల వల్ల మేం చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా పుస్తకాలు తడిసి పోతున్నాయి”అని కల్పన అనే ఏడవ తరగతి చదువుతున్న పాప బాధపడింది. పై కప్పులో పగుళ్లిచ్చి పెచ్చులు ఊడి పడిపోవటం వల్ల మేము గొడుగులు తీసుకురావాల్సి వచ్చింది” అని ఆ పాప ఎంతో బాధతో చెప్పింది.

ఇటువంటి పాఠశాలల వలన చదువులు రావటం ఏమోకానీ పిల్లల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అనడంలో సందేహం లేదు. నానిన పైకప్పు ఎప్పుడైనా కూలవచ్చు. అదే జరిగితే ప్రాణనష్టాన్ని ఊహించడం కూడా కష్టమే.

ప్రభుత్వాలు అత్యంత ముఖ్యమైన విద్యా వ్యవస్థను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఏటికేడాది ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చే పిల్లలు బడి మానేయటానికి ఇటువంటి కారణాలు ఎన్నో ఉన్నాయి.

First Published:  9 Sep 2019 4:00 AM GMT
Next Story